త్వరగా నిద్రపోవాలంటే ఈ సింపుల్‌ చిట్కాలు పాటించండి చాలు..!

కొంతమందికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు.. త్వరగా నిద్రపోవాలి అని మనం అనుకుంటాం.. మన శరీరం, బ్రెయిన్‌ అనుకోదేమో.. చేసేది ఏం లేపోపోయినా.. అలానే మేల్కుంటాం. ఖాళీగా ఉంటే ఏవేవో ఆలచనలు..

త్వరగా నిద్రపోవాలంటే ఈ సింపుల్‌ చిట్కాలు పాటించండి చాలు..!


కొంతమందికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు.. త్వరగా నిద్రపోవాలి అని మనం అనుకుంటాం.. మన శరీరం, బ్రెయిన్‌ అనుకోదేమో.. చేసేది ఏం లేపోపోయినా.. అలానే మేల్కుంటాం. ఖాళీగా ఉంటే ఏవేవో ఆలచనలు.. ఇవన్నీ ఎందుకు బెడ్‌ ఎక్కగానే నిద్రపోతే సరిపోదు. సరిగా నిద్రపోతే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు నుంచి బయటపడొచ్చు. చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. దీని ద్వారా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమంది మాత్రలు వేసుకుని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ వీటితో చాలా డేంజర్. ఒత్తిడితో కూడిన జీవితం, ఆహారపు అలవాట్లు నిద్రలేమికి ప్రధాన కారణాలు. కొన్ని సహజ పద్ధతులను అనుసరించడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అవేంటంటే..

నిద్రపోయే ముందు కంటి మాస్క్(Eye Mask) వాడటం మంచిది. ఇది మీ నిద్రకు భంగం కలిగించే కాంతి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. త్వరగా నిద్రపడుతుంది.

డిన్నర్ త్వరగా ముగించడం మరో చిట్కా. పడుకునే మూడు గంటల ముందు భోజనం చేయాలి.. దీని వల్ల నిద్రవేళలో తిన్న ఆహారం జీర్ణమవుతుంది.


తిన్న వెంటనే నిద్రపోకూడదు..

ఉదయం, రాత్రి పడుకునే ముందు 10-15 నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తే ఒత్తిడి తగ్గి నిద్ర వేగంగా వస్తుంది.

లావెండర్ ఆయిల్ మనస్సును రిలాక్స్ చేస్తుంది. నిద్రను ప్రోత్సహిస్తుంది. రాత్రి పడుకునే ముందు స్నానం చేసే నీటిలో రెండు చుక్కలు వేసి స్నానం చేయాలి. లావెండర్ ఆయిల్ రెండు చుక్కలు దిండుపై వేయండి. వాసనతో త్వరగా మంచి నిద్ర వస్తుంది.

పడుకునే ముందు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. పడుకునే ముందు వ్యాయామం చేయకండి. సాయంత్రం 5 గంటలలోపు పూర్తి చేయడం మంచిది. ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

చమోమిలే ఆయిల్.. ఈ నూనె మనస్సును రిలాక్స్ చేసి నిద్రను ప్రేరేపిస్తుంది.. రాత్రి స్నానం చేసేటపుడు నీళ్లలో వేసి చేయండి... దీని వల్ల మంచి నిద్ర వస్తుంది.

కంప్యూటర్లు, మొబైల్స్ వంటి గాడ్జెట్లతో సమయం గడపడం కంటే పుస్తకాలు చదవడం, వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకుంటే నిద్రలేమి తొలగిపోయి చక్కగా నిద్ర పడుతుంది.

పడుకునే ముందు స్పైసీ ఫుడ్ తినకండి. ఇవి నిద్రను దూరం చేస్తాయి. కాబట్టి పడుకునే ముందు తేలికపాటి, సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది.. రాత్రి పూట పేదవాడిలా భోజనం చేయాలని మన పెద్దోళ్లు చెప్తుంటారు. అంటే చాలా తక్కువగా తినాలని అర్థం..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.