ఏమి తిన బుద్ది కాన‌ప్పుడు చక్కగా గోంగూర పచ్చడి తయారు చేసుకొని తింటే.. రుచితో పాటు అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం

తెలుగు రాష్ట్రాల్లో గోంగూర పచ్చడి రుచి తెలియని వారు ఉండరు. సందర్భం ఏదైనా గోంగూరతో ఏదైనా వంటకం ఉండాల్సిందే. అంతలా మనం వంటల్లో మమేకమైన ఈ గోంగూర ఎన్నో ఔషధ గుణాలకు కేంద్రం. గోంగూర‌తో మ‌నం ప‌చ్చ‌డిని

ఏమి తిన బుద్ది కాన‌ప్పుడు చక్కగా గోంగూర పచ్చడి తయారు చేసుకొని తింటే.. రుచితో పాటు అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం


తెలుగు రాష్ట్రాల్లో గోంగూర పచ్చడి రుచి తెలియని వారు ఉండరు. సందర్భం ఏదైనా గోంగూరతో ఏదైనా వంటకం ఉండాల్సిందే. అంతలా మనం వంటల్లో మమేకమైన ఈ గోంగూర ఎన్నో ఔషధ గుణాలకు కేంద్రం. గోంగూర‌తో మ‌నం ప‌చ్చ‌డిని, ప‌ప్పును, గోంగూర పులిహోర‌ను, గోంగూర మ‌ట‌న్, గోంగూర చికెన్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. గోంగూర ప‌చ్చ‌డిలో ప‌చ్చి ఉల్లిపాయ‌ను వేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. గోంగూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మనం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

గోంగూర ఆకుల‌తోనే కాకుండా గోంగూర కాయ‌ల మీద ఉండే పొట్టుతో కూడా ప‌చ్చ‌డిని త‌యారు చేస్తారు. గోంగూర ఆకుల‌తోపాటు కాయ‌లు, పువ్వులు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ గోంగూర ఆకుల‌కు ఆముదాన్ని రాసి వేడి చేసి శరీరంపై వచ్చే గ‌డ్డ‌ల‌కు క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల... గడ్డలు త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి.

గోంగూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల నేత్ర సంబంధ‌మైన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. రేచీక‌టి స‌మ‌స్య త‌గ్గుతుంది. ద‌గ్గు, ఆయాసం, తుమ్ముల‌తో బాధ‌ప‌డే వారు గోంగూర‌ను తిన‌డం వ‌ల్ల ఈ సమస్యల నుంచి ఉప‌శ‌మ‌పం ల‌భిస్తుంది. గోంగూర‌లో కాల్షియం, ఐర‌న్, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, ఫోలిక్ యాసిడ్ ల‌తో పాటు పీచు ప‌దార్థాలు కూడా అధికంగా ఉంటాయి.

శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జీర్ణ శ‌క్తిని పెంచ‌డంలో గోంగూర ఎంతో ఉపయోగపడుతుంది. ర‌క్త హీన‌త స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు గోంగూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుకునేలా చేయ‌డంలో గోంగూర ఉత్తమంగా పనిచేస్తుంది. అతిగా వేడి చేసే శ‌రీర త‌త్వం ఉన్న వారు గోంగూర‌ను తిన‌క పోవ‌డ‌మే మంచిది. వారానికి రెండు సార్లు గోంగూర‌ను తిన‌డం వ‌ల్ల రోగాల బారిన ప‌డ‌కుండా ఉంటామని, కీళ్ల నొప్పులు ద‌రి చేర‌వ‌ని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.