దీపావళి రోజు క్రాకర్స్‌ వల్ల గాయాలైతే.. వెంటనే ఈ హోమ్ రెమిడీస్‌ ట్రై చేయండి..! 

దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.  పటాకులు కాల్చే సమయంలో చిన్న చిన్న గాయాలు అవడం సహజం. పటాకుల నిప్పురవ్వలు మీద

దీపావళి రోజు క్రాకర్స్‌ వల్ల గాయాలైతే.. వెంటనే ఈ హోమ్ రెమిడీస్‌ ట్రై చేయండి..! 


దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.  
పటాకులు కాల్చే సమయంలో చిన్న చిన్న గాయాలు అవడం సహజం. పటాకుల నిప్పురవ్వలు మీద పడి శరీరం కాలడం సహజం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అనుకోకుండా కాలితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Cracker bursting: Day after Diwali, eye injury cases surge in Hyderabad  hospitals | In Focus News, Times Now
 
పటాకులు కాల్చేటప్పుడు వైద్యుల సలహా:
- పటాకులు కనీసం 2-3 అడుగుల దూరం నుంచి కాల్చాలి.
- పటాకులు కాల్చేందుకు పొడవాటి కర్రను ఉపయోగించాలి.
- మీరు పటాకులు కొనవలసి వస్తే, ఐఎస్‌ఐ మార్క్ ఉన్న గ్రీన్ పటాకులను కొనండి.
- మైదానాలు, ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే పటాకులు కాల్చాలి.
- పిల్లలను ఒంటరిగా బాణాసంచా పేల్చడానికి అనుమతించవద్దు. మీతో తల్లిదండ్రులు ఉన్నారు.
- పటాకులు పేలినప్పుడు కళ్లలోకి ఏదైనా నిప్పురవ్వ పడితే కళ్లను రుద్దకండి.
- సగం కాలిన బాణసంచా గాలిలో తాకడానికి లేదా విసిరే ప్రయత్నం చేయవద్దు.
- గాజులు, డబ్బాలు లేదా ఇతర కంటైనర్‌లను పెట్టి పటాకులు లేదా రాకెట్లను వెలిగించే ప్రయత్నం చేయవద్దు.

క్రాకర్‌ వల్ల గాయాలు అయితే వెంటనే ఇలా చేయండి..

వెంటనే నీళ్లతో క్లీన్ చేయడం: క్రాకర్స్ కాల్చేటప్పుడు చేతులు లేదా ఏ ప్రాంతంలో కాలినా.. వెంటనే నీటిని అప్లై చేయాలి. దీనివల్ల గాయపడిన ప్రాంతంలో టెంపరేచర్ తగ్గించవచ్చు.. కాలిన గాయం నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. దీనివల్ల నొప్పి, బొబ్బలు తగ్గుతాయి. క్రాకర్స్ కాల్చేటప్పుడు కాలిన వెంటనే చేయాల్సిన మొదటి చికిత్స ఇది. సో మరిచిపోకండి. 

పసుపు :

కాలిన గాయాలకు పసుపు అమేజింగ్‌గా పనిచేస్తుంది. పసుపును పేస్ట్‌గా తయారు చేసి.. కాలిన ప్రాంతంలో రాయాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి.. వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. ఇది యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. కాబట్టి ఎలాంటి చిన్న గాయం తగిలినా.. వెంటనే పసుపు ఉపయోగించడం మానకండి. 

తేనె :

దీపావళి సమయంలో ఇంట్లో తేనె ఉండేలా జాగ్రత్త పడండి. ఎందుకంటే.. కాలిన గాయాలు మాన్పడానికి ఇది మంచి మెడిసిన్. కాలిన గాయాలను తగ్గించడమే కాదు.. ఇన్ఫెక్షన్‌లు రాకుండా చేస్తుంది. గాయాలపై తేనెను రుద్దకుండా.. ఊరికే అప్లై చేయాలి. దీనివల్ల సత్వర ఉపశమనం ఉంటుంది. 

వెనిగర్ :

దీపావళి సమయంలో కాలిన గాయాలకు వెనిగర్ చక్కటి పరిష్కారం. అయితే డైరెక్ట్ గా అప్లై చేయకుండా.. వెనిగర్‌లో క్లాత్ ముంచి.. కాలిన ప్రాంతంలో వెనిగర్‌లో ముంచిన క్లాత్ ను అద్దితే సరిపోతుంది. 

టూత్ పేస్ట్ :

కాలిన గాయాలకు టూత్ పేస్ట్ గానీ, ఫౌంటేన్ పెన్ ఇంకు కానీ రాయడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. కాలిన ప్రాంతంలో చల్లగా అనిపించడమే కాదు.. బొబ్బలు కూడా పెరగకుండా పనిచేస్తుంది. 

యాంటీ సెప్టిక్ లోషన్స్ :

దీపావళి వచ్చేసింది కాబట్టి ఇంట్లో యాంటీ సెప్టిక్ లోషన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే తీసుకురావడం మంచిది. ఏమాత్రం చేతులు కాలినా.. వెంటనే ఈ లోషన్ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

అలోవెరా :

కాలిన గాయాల నుంచి ఉపశమనం కలిగించడానికి మంచి హెర్చల్ రెమెడీ అలోవెరా. తీవ్రంగా కాలిన గాయాలను కూడా వెంటనే మాన్పించే పవర్ దీనికుంది. అలోవెరా లోపల ఉండే గుజ్జుని తీసి గాయంపై రాయాలి. ఇది బొబ్బలు పెద్దగా రాకుండా కాపాడుతుంది.
ఈ ప్రథమ చికిత్స చిట్కాలన్నీ మైండ్‌లో పెట్టుకోండి. హ్యాపీగా జాగ్రత్తగా దీపావళి సెలబ్రేట్ చేసుకోండి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.