Storing food in fridge : ఫ్రిజ్లో ఏ పదార్థాలు ఎన్ని రోజులు ఉంచాలో తెలుసా.. !

Fridge విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లేదంటే ఎక్కువగా బ్యాక్టీరియా పేరుకుపోయి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.. ఫ్రిజ్లో కొన్ని వస్తువులను కొన్ని చోట్ల పెట్టాలి..

Storing food in fridge : ఫ్రిజ్లో ఏ పదార్థాలు ఎన్ని రోజులు ఉంచాలో తెలుసా.. !
Storing food in fridge


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే వస్తువు fridge. ముఖ్యంగా ఇది లేని ఇల్లే లేదని చెప్పవచ్చు.  మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయిన fridge రోజు వాడుతున్న తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రిజ్లో ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి. అలాగే ఆహార పదార్థాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే విషయం చాలామందికి తెలియదు అందుకే ఈ ఇది పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలుస్తోందని తెలుస్తుంది.. 

ఫ్రిడ్జ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లేదంటే ఎక్కువగా బ్యాక్టీరియా పేరుకుపోయి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.. ఫ్రిజ్లో కొన్ని వస్తువులను కొన్ని చోట్ల పెట్టాలి.. ముఖ్యంగా పైన ఉన్న ట్రేలో గుడ్లు, పాలు, పాల పదార్థాలు ఉంచాలి..

 అలాగే రెండో ట్రేలో తినగా మిగిలిన పదార్థాలను.. మూడో అరలో అంతగా చల్లదనం అవసరం లేని పదార్థాలు పెట్టుకోవాలి. చివరగా కింద డ్రాయర్‌లో కూరగాయలు, పళ్లు వాటికి సంబంధించినవి పూంచాలి అలాగే ఫ్రిడ్జ్ కు పక్కన ఉండే డోర్లలో పానీయాలు మసాలాలు జ్యూస్ లో నీళ్లు వంటివి భద్రపరుచుకోవాలి.. 

అలాగే ఫ్రిజ్లో కొన్ని పదార్థాలు కొన్ని రోజులే ఉంచాలి అని నియమం ఉంటుంది.. వాటిలో చేపలు, మాంసం: 3 రోజులు, సాసులు: 20-30 రోజులు, తిన్నాక మిగిలినవి: 1-2 రోజులు, పళ్లు, కాయగూరలు: 3-7 రోజులు వుంచాలి.. అలాగే పాలు: 2-5 రోజులు, బేకరీ, కేకులు, పేస్ట్రీలు: 5 రోజులు, గుడ్లు: 7 రోజులు ఉంచాలి ఇంతకుమించి ఎక్కువ రోజులు ఉంచడం వల్ల అవి ఖచ్చితంగా పడే అవకాశం ఉంది.. చల్లగా ఉంటుంది కదా అందులో నుంచి ఆహార పదార్థాలకు ఏమీ కాదు ఎన్నాళ్ళైనా అలానే ఉంచవచ్చు అని అపోహతో ఉండరాదు అలా చేయడం వల్ల ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.