మోనోపాజ్‌లో బరువు పెరుగుతున్నారా..? ఇలా చేయండి

మహిళలకు మోనోపాజ్‌ స్టేజ్‌ చాలా క్రిటకల్‌గా ఉంటుంది. ఈ స్టేజ్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వారి ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. మహిళలు మెనోపాజ్ దశలో బరువు పెరిగిపోతుంటారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే

మోనోపాజ్‌లో బరువు పెరుగుతున్నారా..? ఇలా చేయండి


మహిళలకు మోనోపాజ్‌ స్టేజ్‌ చాలా క్రిటకల్‌గా ఉంటుంది. ఈ స్టేజ్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వారి ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. మహిళలు మెనోపాజ్ దశలో బరువు పెరిగిపోతుంటారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. నలభై, నలభై అయిదేళ్లు దాటిన స్త్రీలలో మెనోపాజ్‌ వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. రుతుక్రమం ఆగిపోవడానికి ముందు శరీరం తనని తాను సిద్ధం చేసుకోవడానికి ఈ మార్పులన్నీ ఏర్పడతాయి. దీనిలో భాగంగానే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల శరీరంలో కొవ్వులు పేరుకుపోయి బరువు పెరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ క్రమంలోనే చాలా మందిలో పొట్ట దగ్గరా కొవ్వు పట్టేస్తుంది. కొన్ని ఆహారాలను తప్పకుండా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు జీవన విధానంలోనూ మార్పులు చేయాలి. ఈ స్టేజ్‌లో బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
The Truth About Menopause and Weight Gain - HealthyWomen
మెనోపాజ్‌ సమయంలో స్త్రీలు తక్కువలో తక్కువ రెండు మూడు కిలోలైనా బరువు పెరుగుతారని వైద్యులు అంటున్నారు.. బరువు పెరగకూడదు అంటే.. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం తగ్గించాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. అలాగే తినే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పళ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఈ సమయంలో శరీరం లోపల వచ్చే వాపుల నుంచి రక్షణ పొందవచ్చు.
మెనోపాజ్‌లో స్త్రీల శరీరంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థాయిలు బాగా తగ్గిపోతాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా బయట నుంచి ఫైటో ఈస్ట్రోజన్‌ని తీసుకోవాలి. సోయా బీన్స్‌, నువ్వులు, అవిసెలు, వెల్లుల్లి, పీచ్‌లు, బెర్రీలు , గోధుమ పొట్టు(తవుడు), బ్రోకలీ, క్యాబేజ్‌, డ్రైఫ్రూట్స్‌ వంటి ఆహార పదార్థాలను తరచూ తినాలి. వీటితోపాటు చిక్కుళ్లు, చేపలు, తక్కువ కొవ్వులు ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతోపాటు రోజూ కచ్చితంగా శారీరక శ్రమను పెంచాలి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండటం వల్ల శరీర యాక్టివిటీని పెంచాలి. మనిషి మరీ సుఖపడిపోతే.. చావుకు దగ్గరపడినట్లే.. మీకు పనిచేయాల్సిన అవసరం లేదు.. అన్నీ చేసిపెట్టేటవాళ్లు ఉన్నాసరే.. రోజూ ఒక గంట సేపు శారీరక శ్రమ చేయండి. వాకింగ్‌, వ్యాయామం వంటివి చేయండి. ఇంటి పనులు, గార్డెనింగ్‌, లిఫ్ట్‌లో కాకుండా మామూలుగా మెట్లెక్కి వెళ్లడం, ఫోన్‌ మాట్లాడేప్పుడు నడుస్తూ మాట్లాడటం లాంటి వాటిని చేయండి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. బరువును నియంత్రించేందుకు ఏరోబిక్స్‌ బాగా సహాయ పడుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 
ఈ ఆహారాలు, వ్యాయామాల ద్వారా మెనోపాజ్‌ సమస్యల నుంచి తేలికగా బయటపడొచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.