లివర్‌ కు లవర్‌ బొప్పాయి.. రోజూ కప్పుడు ముక్కలు తింటే బోలెడు లాభాలు..!

లివర్‌ను పాడుచేసే వాటిలో మొదటిది మద్యం తాగడం.. మద్యం తాగడం వల్ల ఫ్యాటీ Liver సమస్య వస్తుంది. ఫ్యాటీ లివర్‌ అంటే.. కొవ్వు పట్టిన లివర్‌.. లివర్‌కు కొవ్వు పట్టడం వల్ల అది ఏ పని చేయకుండా చల్లగా పడుకుంటుంది.

లివర్‌ కు లవర్‌ బొప్పాయి.. రోజూ కప్పుడు ముక్కలు తింటే బోలెడు లాభాలు..!
Benefits of eating papaya for liver


లవర్‌ లేకున్నా బతికేయొచ్చు కానీ.. బాడీలో Liver లేకపోతే మాత్రం అస్సలు బతకలేరు. అది ఆరోగ్యంగా లేకపోతే..ఎన్నో సమస్యలు. కానీ మనం చేసే తీట పనుల వల్ల Liver సమస్యలు వస్తుంటాయి. Liverను పాడుచేసే వాటిలో మొదటిది మద్యం తాగడం.. మద్యం తాగడం వల్ల ఫ్యాటీ లివర్‌ సమస్య వస్తుంది. ఫ్యాటీ లివర్‌ అంటే.. కొవ్వు పట్టిన లివర్‌.. లివర్‌కు కొవ్వు పట్టడం వల్ల అది ఏ పని చేయకుండా చల్లగా పడుకుంటుంది. లివర్‌ మన శరీరంలో రోజూ వందల కొద్ది విధులు నిర్వహిస్తుంది. ఎప్పుడైతే ఇది పడకేస్తుందో.. బాడీలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దాంతో అధిక బరువు, ఫ్యాట్‌, గుండె సమస్యలు అబ్బో లిస్ట్‌ చాలనే ఉంది. మ‌ద్యం సేవించ‌కపోయినా కొవ్వు ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది. అలాగే కొంద‌రికి లివ‌ర్ క్యాన్స‌ర్‌, హెప‌టైటిస్ వంటి లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే బ‌రువు అక‌స్మాత్తుగా త‌గ్గిపోవ‌డం, ఆక‌లి లేక‌పోవ‌డం, శ‌రీరం ప‌చ్చ‌గా మార‌డం.. వంటి అనేక ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి.

అయితే లివ‌ర్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తినాలి. దీని వ‌ల్ల లివ‌ర్ శుభ్ర‌ప‌డుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. అయితే లివ‌ర్‌ను శుభ్ర ప‌రిచి లివ‌ర్ వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో బొప్పాయి నెంబర్‌ వన్‌గా పనిచేస్తుంది. ఈ పండ్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఎలాంటి లివ‌ర్ వ్యాధి అయినా స‌రే త‌గ్గిపోతుంది.
బొప్పాయి పండ్ల‌లో విట‌మిన్లు ఏ, బీ, సీ, ఇ లు అధికంగా ఉంటాయి. అలాగే ఐర‌న్‌, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, కోలిన్ వంటి పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల ఆగిపోతుంది. బొప్పాయి పండును రోజూ తీసుకుంటే లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మద్యం తాగే వాళ్లు బొప్పాయిను డైలీ తినాలి. .
బొప్పాయి పండును రోజూ ఒక క‌ప్పు మోతాదులో తిన‌డం వ‌ల్ల లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. ఫ్యాట్ క‌రుగుతుంది. లివ‌ర్ ఆరోగ్యంగా మారుతుంది. అలాగే బొప్పాయి ఆకుల ర‌సాన్ని కూడా రోజూ పావు టీస్పూన్ చొప్పున తాగుతుండాలి. దీంతో అన్ని ర‌కాల లివ‌ర్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.
లివర్‌ సమస్యలున్నవారు.. బొప్పాయి పండును రోజు తిని మీ సమస్యలను తగ్గించుకోండి. బాడీలో ఉన్న అవయవాల్లో లివర్‌ చాలా మంచిది. ఎందుకంటే.. మీరు దాన్ని ఎంత పాడుచేసినా.. ఆరునెలలు కరెక్ట్‌ ఫుడ్‌ పెట్టారంటే.. మళ్లీ మాములు స్థితికి వచ్చేస్తుంది. అదే మరే అవయవం అయినా.. ఒక్కసారి పాడేందంటే.. అది ఎప్పుడు మరమ్మతు చేసినదానిలానే ఉంటుంది. కాబట్టి లివర్‌ను జాగ్రత్తగా కాపాడుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.