బట్టతల రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. మరి ఈ విషయాల్లో జాగ్రత్త పాటిస్తున్నారా!

మారిపోతున్న జీవన శైలితో మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇందులో భాగంగా ఉబకాయ మధుమేహం అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నాడు వీటితోపాటు అధికంగా జుట్టు ఊడిపోవటం సమస్య కూడా మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేదించే సమస్య బట్టతల అయితే ఈ సమస్య రావటానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..

Female pattern baldness: Causes, treatment, and prevention
ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలామంది అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. చిన్నవయసులోని విపరీతంగా జుట్టు ఊడిపోవడం బట్ట తల వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. 
ఈ రోజుల్లో ముఖ్యంగా 30 ఏళ్లలోపై యువత జుట్టు రాలిపోవడం వంటి సమస్యతో అత్యంత ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కప్పుడు కాలుష్యం అనేది తక్కువగా ఉండడం వలన వయస్సు పెరిగిన కొలది జుట్టు రాలడం జరుగుతుండేది. కానీ నేడు ఉన్న పరిస్థితుల ప్రభావం వలన యువత ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. 
వయసు పెరుగుతున్న కొలది జుట్టు సన్నబడి పల్చగా మారుతుంది. ముందుగా మొదటి భాగంలో మొదలైన ఈ సమస్య క్రమంగా తల మధ్య భాగం వరకు వ్యాపిస్తుంది.
మానసిక ఒత్తిడికి ఎక్కువగా లోనయ్యే వారికి ఈ జుత్తు రాలడం అనేటటువంటి సమస్య అధికంగా వేధిస్తూ ఉంటుంది. అందువలన సాధ్యమైనంతవరకు ఒత్తిడికి గురి కాకపోవడమే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు 
హార్మోన్ ప్రభావం వలన కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుందని.. థైరాయిడ్ గ్రంధిలో వచ్చే సమస్య వలన జుట్టు రాలడం అన్నది అధికమవుతుందని తెలియజేస్తున్నారు. 
కొంతమందికి వంశ్య పర్యా పరంగా కూడా ఈ సమస్య సంభవిస్తూ ఉంటుంది. అటువంటి వారికి చిన్నతనంలోనే ఈ బట్టతల సమస్య వేధిస్తూ ఉంటుంది. 
గుండె జబ్బు కలవారు.. కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వారు దీర్ఘకాలికంగా మందులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎక్కువకాలం ఆరోగ్యానికి సంబంధించిన మందులు వాడటం వల్ల జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 
గర్భధారణ సమయంలో స్త్రీలు కూడా ఈ జుట్టు రాలడం వంటి సమస్యతో అధికంగా బాధపడుతూ ఉంటారు. అందుకే ఈ విషయాలు అన్నిట్లో తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల జుట్టు రాలే సమస్యను అదుపు చేయడమే కాకుండా బట్టతలను నివారించవచ్చు అంతేకాకుండా వేటితో పాటు తిరగడం తగ్గించాలి పోషకాహారం తీసుకోవడం అధికంగా నీరు తాగడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.