రక్తహీనత సమస్య చాలా ప్రమాదం.. ఈ ఆహారాలను తినండి..!

మన శరీరానికి రక్తం, మంచినీరు పెట్రోల్‌, డీజిల్‌ లాంటివి.. ఇవి లేకపోతో మన బండి నడవటం కష్టమే.. వాటర్‌ అయితే ఈజీగా తాగేయొచ్చు.. కానీ రక్తం తక్కువగా ఉంటే ఎలా.. అలా గ్లాస్‌లో పోసుకుని తాగేయలేం కదా..! రక్తహీనత అనేది మీరు అనుకునేంత

రక్తహీనత సమస్య చాలా ప్రమాదం.. ఈ ఆహారాలను తినండి..!


మన శరీరానికి రక్తం, మంచినీరు పెట్రోల్‌, డీజిల్‌ లాంటివి.. ఇవి లేకపోతో మన బండి నడవటం కష్టమే.. వాటర్‌ అయితే ఈజీగా తాగేయొచ్చు.. కానీ రక్తం తక్కువగా ఉంటే ఎలా.. అలా గ్లాస్‌లో పోసుకుని తాగేయలేం కదా..! రక్తహీనత అనేది మీరు అనుకునేంత చిన్న సమస్య కాదు.. ముఖ్యంగా మహిళలకు రక్తహీనత సమస్య ఉండొద్దు.. మీకు రక్తహీనత సమస్య ఉంటే.. ఇలాంటి ఆహారాలను తినండి..! ఈ ఆహారాలను నెలరోజుల పాటు క్రమం తప్పకుండాడైలీ డైట్‌లో చేర్చారంటే.. మీ బ్లడ్‌ లెవల్స్‌ కచ్చితంగా పెరుగుతాయి.! 

టమాటాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఉదయాన్నే 5 టమాటాల నుంచి జ్యూస్ తీసుకుని తాగాలి. సూప్‌లా చేసుకుని కూడా తాగొచ్చు.
 
రక్తం పెరగడానికి దోహదం చేసే మరో పదార్థం బీట్ రూట్. సలాడ్‌లా చేసుకుని దీన్ని తీసుకోవచ్చు. దీన్ని తియ్యగా మార్చుకునేందుకు ఇందులో కొంచెం బెల్లం కలపవచ్చు. దీని వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.

విటమిన్ బి6, ఏ, సి, ఐరన్, కాల్షీయం, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉండే పాలకూర తీసుకోవడం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
 
రోజూ ఒక యాపిల్ తినడం ద్వారా అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు... రక్తహీనత నుంచి బయటపడేందుకు కూడా ఆపిల్‌ మంచి ఔషధంగా పని చేస్తుంది.

జామపండ్లు తీసుకోవడం ద్వారా కూడా ఎనిమియా సమస్యకు చెక్ పెట్టొచ్చు. రోజూ ఈ పండ్లను తీసుకోవడం ద్వారా రక్తహీనతను అధిగమించవచ్చు.
 
దానిమ్మపండ్లు తినడం ద్వారా శరీరంలో రక్తం పెంపొందించుకోవచ్చు. అందుకే డైట్‌లో దీన్ని భాగం చేసుకోవాలి.

వీటితో పాటు కిస్‌మిస్‌లను ఒక గుప్పెడు మోతాదులో తీసుకుని రాత్రి వేడినీటిలో మరిగించి నానపెట్టుకోని ఆ నీళ్లతో సహా కిస్‌మిస్‌లు తింటుంటే.. త్వరగా రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు. 

బాదం, వాల్‌నట్స్‌, డేట్స్‌ లాంటివి ఎక్కువగా తినాలి..

టీ, కాఫీలు మానేసి.. గ్రీన్‌టీ తాగితే ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు జరుగుతుంది. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.