Black Cumin Seeds : నరాల బలహీనతా..? న‌ల్ల జీల‌క‌ర్ర‌తో ఇలా చేసి తగ్గించేయండి..!

Black Cumin Seeds : నరాల బలహీనత అనేది అటు చిన్న సమస్య కాదు.. అలా అని పెద్ద సమస్య కాదు. కానీ దీనివల్ల మనిషి చాలా ఇబ్బంది పడతాడు. కాళ్లు, చేతులు వణకడం, కళ్ల నుంచి నీరు కారడం

Black Cumin Seeds : నరాల బలహీనతా..? న‌ల్ల జీల‌క‌ర్ర‌తో ఇలా చేసి తగ్గించేయండి..!


Black Cumin Seeds : నరాల బలహీనత అనేది అటు చిన్న సమస్య కాదు.. అలా అని పెద్ద సమస్య కాదు. కానీ దీనివల్ల మనిషి చాలా ఇబ్బంది పడతాడు. కాళ్లు, చేతులు వణకడం, కళ్ల నుంచి నీరు కారడం, గుండెదడ, బరువులు మోయలేకపోవడం ఇవన్నీ.. నరాల బలహీనత వల్ల వచ్చే సమస్యలే.. ఈ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసే ఉంటారు. కొన్ని ర‌కాల చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయాలి. చెప్పులు లేకుండా గ‌డ్డిలో న‌డ‌వ‌డం అల‌వాటు చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల న‌రాల్లో క‌ద‌లిక‌లు వ‌చ్చి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డి మంచి ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అలాగే ప్ర‌తిరోజూ ఉదయం..ఎండ‌లో ఉండాలి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తినాలి.. వాల్ నట్స్, పుచ్చ‌కాయ‌, బ‌చ్చ‌లికూర‌, అర‌టి పండు వంటి ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.

ఈ ఆహార ప‌దార్థాల‌న్నీ న‌రాల‌ను గ‌ట్టి ప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ప్ర‌తిరోజూ కొద్ది దూరం న‌డ‌వాలి. పాల‌ల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది కాబట్టి.. త‌ప్ప‌కుండా పాల‌ను తాగాలి. గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగాలి. అలాగే శరీరానికి కూడా మ‌ర్ద‌నా చేసుకుంటూ ఉండాలి. షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారిలో, మ‌ద్యం తాగే వారిలోనూ, శాకాహారుల్లోనూ న‌రాల బ‌ల‌హీన‌త వ్యాధి ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

న‌రాల బ‌ల‌హీన‌త‌ల‌ను త‌గ్గించే ఇంటి చిట్కాలు..

ఇందుకోసం మనం న‌ల్ల జీల‌క‌ర్ర‌ను, మెంతుల‌ను, అశ్వ‌గంధ వేరును ఉపయోగించాలి.. ముందుగా ఒక జార్‌లో 50 గ్రా.ల జీల‌క‌ర్ర‌ను, 50 గ్రా. మెంతుల‌ను, 50 గ్రా.ల అశ్వ‌గంధ వేరును వేసి మెత్త‌ని పొడిలా చేయండి.. ఈ పొడిని గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. అలాగే రాత్రి భోజ‌నం చేయ‌డానికి అర‌గంట ముందు తాగాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా 21 రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త‌, వంటి నొప్పులు, ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ ఇంటి చిట్కాను కూడా పాటించ‌డం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య నుంచి త్వ‌రిత‌గ‌తిన ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని వైద్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.