కిడ్నీలో అసలు రాళ్లు ఎలా ఎందుకు ఏర్పడతాయో తెలుసా..?

కిడ్నీ స్టోన్స్ అనేది నేడు చాలా కామన్‌ సమస్య అయిపోయింది. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగా మారింది. కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం. అసలు కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి. ఎలాంటి తప్పుల వల్ల కిడ్నీలు రాళ్లు తయారువుతాయో చూద్దాం..! 

కిడ్నీలో అసలు రాళ్లు ఎలా ఎందుకు ఏర్పడతాయో తెలుసా..?


కిడ్నీ స్టోన్స్ అనేది నేడు చాలా కామన్‌ సమస్య అయిపోయింది. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగా మారింది. కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం. అసలు కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి. ఎలాంటి తప్పుల వల్ల కిడ్నీలు రాళ్లు తయారువుతాయో చూద్దాం..! 

Kidney – Kosmos Publishers HD wallpaper | Pxfuel

కాల్షియం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినే వారి కంటే తక్కువగా తినే వారికే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాళ్లు ఏర్పడేందుకు కారణమయ్యే ఆక్జలేట్స్‌ను మూత్రాశయంలోకి రానివ్వకుండా కాల్షియం అడ్డుకుంటుంది. ఇందుకోసం అది వివిధ రకాల రసాయనాలతో మిళితమై పనిచేస్తుంది. 
 
కిడ్నీ స్టోన్స్ తొలి దశలో పొట్ట కింది భాగంలో లేదా వెన్నులో నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి ఒక్కోసారి తక్కువగా, ఒక్కో సందర్భంలో ఎక్కువగా ఉండొచ్చు. ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి.
కిడ్నీ స్టోన్స్ ఉన్నవారి మూత్రం రంగు కూడా మారుతుంది. ఎందుకంటే ఆ రాళ్లు మూత్రశాయంలో అటు ఇటు కదులుతూ ఉండడం వల్ల దాంతో ఉండే మూత్రం రంగు మారి అలాగే బయటికి వస్తుంది. ఇది ఘాటైన దుర్వాసనను కలిగి ఉంటుంది.
మూత్రాశయంలోకి రాళ్లు వస్తే అవి సదరు అవయవాన్ని వాపులకు గురి చేస్తాయి. ఇది ఎంతగానో ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాదు దీని వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. మూత్రానికి వెళ్లినప్పుడల్లా నొప్పి కూడా ఉంటుంది. అయితే తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, లైంగిక వ్యాధుల వంటి ప్రమేయం కూడా ఉంటుంది. ప‌రీక్ష‌లు చేయించుకుని ఏ వ్యాధి ఉందో నిర్దారించుకోవాలి. అందుకు అనుగుణంగా డాక్ట‌ర్‌చే వైద్యం చేయించుకోవాలి.
 
మూత్రాశయంలో కిడ్నీ స్టోన్స్ ఆగిపోతే వారికి ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. అలసట, వణుకుతో కూడిన జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సార్లు వికారంగా కూడా అనిపిస్తుంది.
 
కిడ్నీస్టోన్స్ ఉంటే ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా వస్తుంది. అయితే ఇది ఎరుపు రంగులో కాక ఎరుపు, పసుపు మిక్స్ చేసిన డార్క్ రంగులో కనిపిస్తుంది.
 
ఇన్‌ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ (ఐబీడీ), క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ స్టోన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరిలో డయేరియా ఉన్నవారు కూడా ఉంటే అది డీహైడ్రేషన్‌కు దారి తీసి కిడ్నీ స్టోన్లు ఏర్పడేలా చేస్తుంది.
మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తరచూ వస్తున్నా కూడా కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. ఇలా గనక జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించి అందుకు అనుగుణంగా పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభించాలి.
విరేచనకారులు (లాక్సేటివ్స్)ను ఎక్కువగా వాడడం వల్ల కూడా కిడ్నీస్టోన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఆ లాక్సేటివ్స్ శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను కలగజేస్తాయి. తద్వారా శరీరం పోషకాలను తక్కువగా గ్రహిస్తుంది. డీహైడ్రేషన్ కూడా కలుగుతుంది. ఇది కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు కారణమవుతుంది.
ఇలా వివిధ కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.