కుంకుమపువ్వు టీతో ఇన్ని ప్రయోజనాలా.. ? అధ్యయనాలు చెప్పిన వాస్తవాలు ఇవే..!

కుంకుమపువ్వు అనగానే..ముందు మనకు అది గర్భిణులు వాడేది అని మాత్రమే గుర్తుకువస్తుంది. కేవలం గర్భిణులకే కాదు.. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. అసలు కుంకుమపువ్వు కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. మీరు కచ్చితంగా వదిలిపెట్టరు. ఒక కప్పు ఛాయ్‌ తాగితే తలనొప్పి తగ్గి రిలీఫ్‌గా ఉంటుంది. అదే ఒక కప్పు కుంకుమపువ్వు టీ తాగితే.. మీరు లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందవచ్చు. 

కుంకుమపువ్వు టీతో ఇన్ని ప్రయోజనాలా.. ? అధ్యయనాలు చెప్పిన వాస్తవాలు ఇవే..!


కుంకుమపువ్వు అనగానే..ముందు మనకు అది గర్భిణులు వాడేది అని మాత్రమే గుర్తుకువస్తుంది. కేవలం గర్భిణులకే కాదు.. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. అసలు కుంకుమపువ్వు కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. మీరు కచ్చితంగా వదిలిపెట్టరు. ఒక కప్పు ఛాయ్‌ తాగితే తలనొప్పి తగ్గి రిలీఫ్‌గా ఉంటుంది. అదే ఒక కప్పు కుంకుమపువ్వు టీ తాగితే.. మీరు లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందవచ్చు. 
ఈ టీని కుంకుమ పువ్వులతో తయారు చేస్తారు. ఇది టీకి గొప్ప రంగు, రుచిని అందిస్తుంది. మీరు అల్లం, దాల్చిన చెక్క మీ ఇష్టానికి తగినట్లుగా వేసుకోవచ్చు. ఇవి టీ రుచిని మరింత పెంచుతాయి. కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, శ్లేష్మం, విటమిన్లు B1, B2 ఇతర వర్ణద్రవ్యాలు దీనిలో మెండుగా ఉంటాయి. తేలికగా తయారు చేసుకోగలిగే ఈ టీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. 
కుంకుమపువ్వు ఓ సాంప్రదాయ ఔషధం. నెలసరి రోజుల్లో దీనిని తీసుకోవడం వల్ల ఋతుస్రావంలో కలిగే తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇదే కాకుండా అనేక రుగ్మతల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పీరియడ్స్ తో ఇబ్బంది పడుతుంటే ఉపశమనం కోసం కుంకుమపువ్వు టీ ఎంచుకోండి.
Saffron, world's most expensive spice, has multiple health benefits – it  fights diabetes, boosts memory, mood and immunity, and is good for skin |  South China Morning Post
కుంకుమపువ్వు యాంటీ డిప్రెసెంట్ లక్షణాలతో పూర్తిగా నిండి ఉంటుంది. తేలికపాటి, మితమైన డిప్రెషన్ చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు డిప్రెషన్ లక్షణాలతో ఉన్నప్పుడు, చిరాకుగా ఉన్నప్పుడు మీ మానసిక స్థితిని మెరుగుపరచుకునేందుకు కుంకుమపువ్వు టీని తాగండి. ఇది మీకు ఆందోళన, డిప్రెషన్ తగ్గించి సాటిలేని ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. సెరోటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్స్‌ను రిలీజ్‌ చేసి మీరు సంతోషంగా, ఆనందంగా ఉండేలా చేస్తుంది.
 
ముఖ్యంగా టైప్-2 మధుమేహం, ప్రీ-డయాబెటిస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కుంకుమపువ్వు టీ తాగవచ్చు. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తాయని నిరూపితమైంది.
కుంకుమపువ్వు సోరియాసిస్ సమస్యకు చికిత్స చేయడంతో పాటు చర్మపు గాయాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా యాంటీ ఏజింగ్ లక్షణాలు దీనిలో ఉన్నాయి. దీనిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వల్ల వయసు మీద పడిన చర్మం యవ్వనంగానే ఉండేలా ఇది ప్రేరేపిస్తుంది.
కుంకుమపువ్వు మెటబాలిక్ సిండ్రోమ్ నిర్వహణలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారిలో కుంకుమపువ్వు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఆకలి, గ్యాస్ట్రిక్ సమస్యలను అదుపులో ఉంచుతుంది. తద్వార మీరు సులువుగా బరువు తగ్గగలుగుతారు.
ఇవేకాకుండా హృదయ సంబంధ వ్యాధుల ముప్పు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బులు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ను నిరోధించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అల్సర్, కాలేయ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 
అంతేకాకుండా.. మగవారిలో స్పెర్మ్-DNA నష్టాన్ని తగ్గించగలదని పలు అధ్యయనాలు నిరూపించాయి.

అతిగా తీసుకుంటే ఈ నష్టాలు కూడా తప్పవు..

కేవలం మంచి మాత్రమే కాదు. .మీరు ఈ కుంకుమపువ్వు టీని ఎక్కువగా తాగితే.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అధిక మోతాదులో కుంకుమపువ్వు తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. బ్లడ్ డిజార్డర్స్ బారిన పడే అవకాశముందట. మీకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే.. కుంకుమ పువ్వు టీని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.