Hair care : తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే చిట్కా..! వాడితే రిజల్ట్‌ పక్కా..!

Hair Cair : ఈరోజుల్లో తెల్ల జుట్టు సమస్య చాలామందిని వేధిస్తుంది. చిన్నవయసులోనే తెల్లజుట్టు రావడం వల్ల ఏజ్‌డ్గా కనిపిస్తారు. ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపూల‌ను ఎక్కువ‌గా వాడిన కూడా జుట్టు త్వ‌ర‌గా తెల్ల‌బ‌డుతుంది. జుట్టు తెల్ల‌బ‌డ‌డానికి అనేక కార‌ణాలు

Hair care : తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే చిట్కా..! వాడితే రిజల్ట్‌ పక్కా..!


Hair Cair : ఈరోజుల్లో తెల్ల జుట్టు సమస్య చాలామందిని వేధిస్తుంది. చిన్నవయసులోనే తెల్లజుట్టు రావడం వల్ల ఏజ్‌డ్గా కనిపిస్తారు. ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపూల‌ను ఎక్కువ‌గా వాడిన కూడా జుట్టు త్వ‌ర‌గా తెల్ల‌బ‌డుతుంది. జుట్టు తెల్ల‌బ‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. పౌష్టికాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వాటి వ‌ల్ల కూడా జుట్టు తెల్ల‌బ‌డుతుంది. తెల్ల‌బ‌డిన జుట్టును చాలా మంది రంగు వేసి న‌ల్ల‌గా మారుస్తుంటారు. కానీ వీటిలో ర‌సాయ‌నాల‌ను ఎక్కువ‌గా వాడుతుంటారు. రంగు వేయ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా మారిన‌ప్ప‌టికి దాని వ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాలు ఉంటాయి. స‌హాజ సిద్దంగా మ‌న వంటింట్లో ఉండే వాటితో కూడా జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. స‌హ‌జ ప‌దార్థాల‌ను ఉప‌యోగించి జుట్టును న‌ల్ల‌గా ఎలా మార్చుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 
Black Hair Shampoo know how to make it in 5 minutes | घर पर 5 मिनट में  बनाएं ये शैंपू, सफेद बालों को जड़ से बना देगा काला | Hindi News, Health
ఉసిరికాయ జ్యూస్, క‌రివేపాకు పొడి, న‌ల్ల నువ్వుల పొడి, మిరియాల పొడి, గోరింటాకు పొడి, టీ పౌడ‌ర్‌ను ఉపయోగించి తెల్లజుట్టును శాస్వతంగా నల్లగా మార్చేయొచ్చు. ఒక గిన్నెను తీసుకుని అందులో పైన తెలిపిన ప‌దార్థాల‌న్నింటిని వేసి పేస్ట్‌లా చేయండి.. ఈ మిశ్ర‌మాన్ని రాత్రే త‌యారు చేసి నిల్వ చేసుకోవాలి. ఉద‌యం దీనిని ఉప‌యోగించాలి అనుకునే ముందు కొద్దిగా వేడి చేసి చ‌ల్లారే వ‌ర‌కు ఉంచి జుట్టుకు రాసుకోవాలి. ఈ మిశ్ర‌మం పూర్తిగా ఆరిన త‌రువాత నీటితో క‌డిగివేయాలి. జుట్టును శుభ్రం చేసుకోవడానికి కేవ‌లం నీటిని మాత్ర‌మే ఉప‌యోగించండి.. షాంపును ఉప‌యోగించ‌కూడ‌దు.
ఈ మిశ్ర‌మాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టుకు ఎన్నో పోష‌కాలు అందుతాయి. జుట్టుకు ఈ ప్యాక్‌ను త‌ర‌చూ వేసుకోవ‌డం వ‌ల్ల తెల్ల జుట్టు క్ర‌మంగా త‌గ్గుతుంది. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాకుండా జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా తెల్ల‌జుట్టును చాలా సుల‌భంగా న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చ‌ని సౌంద‌ర్య నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ మిశ్రమంలో వాడిన పదార్థాలు కూడా అరుదైనవి కావు.. అన్నీ ఈజీగా దొరికేవే..కాబట్టి ట్రై చేసి చూడండి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.