కుంకుమప్పు, యాలుకలతో ఇలా చేస్తే నిద్రమాత్రలు లేకుండానే హాయిగా పడుకుంటారు..!

సోషల్‌ మీడియా వచ్చాక జనాలకు నిద్ర పట్టడం లేదు. కాస్త ఖాళీ దొరికితే ఇంతకుముందు ఒక కునుకుతీద్దాం అనుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు ఇన్‌స్టా ఓపెన్‌ చేద్దామా, ఎఫ్‌బీలో పోస్ట్‌ పెడదామా, వాట్సప్‌లో స్టేటస్‌ పెడదామా ఇదే ఐతుంది. పడుకుందాం అని బెడ్‌ ఎక్కుతారు.. కానీ కరెక్టుగా నిద్రపట్టేటైమ్‌కు ఆ ఫోన్‌లో ఏదో ఒకటి ఓపెన్‌ చేసి కళ్లు అన్నీ అందులోనే పెట్టి చూస్తారు. నిద్రటైమ్‌ మిస్‌ అవుతుంది

కుంకుమప్పు, యాలుకలతో ఇలా చేస్తే నిద్రమాత్రలు లేకుండానే హాయిగా పడుకుంటారు..!


సోషల్‌ మీడియా వచ్చాక జనాలకు నిద్ర పట్టడం లేదు. కాస్త ఖాళీ దొరికితే ఇంతకుముందు ఒక కునుకుతీద్దాం అనుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు ఇన్‌స్టా ఓపెన్‌ చేద్దామా, ఎఫ్‌బీలో పోస్ట్‌ పెడదామా, వాట్సప్‌లో స్టేటస్‌ పెడదామా ఇదే ఐతుంది. పడుకుందాం అని బెడ్‌ ఎక్కుతారు.. కానీ కరెక్టుగా నిద్రపట్టేటైమ్‌కు ఆ ఫోన్‌లో ఏదో ఒకటి ఓపెన్‌ చేసి కళ్లు అన్నీ అందులోనే పెట్టి చూస్తారు. నిద్రటైమ్‌ మిస్‌ అవుతుంది. ఇక ఎన్ని తంటాలు పడినా నిద్రరాదు. ఖాళీగా ఉంటే బుర్ర ఏవేవో ఆలోచిస్తుంది.. ఒక్కటి పనికి వచ్చేది ఉండదు. ఇది కాస్త డిప్రషన్, ఆందోళన, ఒత్తిడికి దారితీస్తుంది. రోజులు వారాలు అవుతాయి, వారాలు నెలలు అవుతాయి. ముఖం మారిపోతుంది. నిద్రలేక ఆస్తులు పోగొట్టుకున్న బికారిలా మీ ముఖం మారిపోయి ఎలా అయినా పడుకోవాలని ఇక ఫైనల్‌గా నిద్రమాత్రలకు అలవాటు పడతారు. దీనివల్ల వచ్చే లొల్లి ఇంకా దారుణం..! ఇదేం లేకుండా.. హ్యాపీగా నిద్రపోవాలంటే.. నిద్రమాత్రల్లాంటి మందు మీ ఇంట్లోనే ఉందిగా..! అదేంటంటే..
Kumkuma Puvvu | annadesignstuff.com
మ‌నం తీసుకునే ఆహారం కూడా కొన్ని సార్లు మ‌న నిద్ర‌లేమికి దారి తీస్తుంది. రాత్రి పూట త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యే ఆహారాల‌ను అది కూడా ప‌డుకోవ‌డానికి రెండు గంట‌ల ముందు తీసుకోవాలి. నిద్రలేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మానసిక ఒత్తిడికి, ఆందోళ‌న‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఒత్తిడి త‌గ్గ‌డానికి ధ్యానం, యోగా వంటివి చేయాలి. అలాగే రాత్రి ప‌డుకునే ముందు గోరు వెచ్చ‌ని పాలు తాగాలి. పాలు తాగ‌డం వ‌ల్ల నిద్ర త్వ‌ర‌గా ప‌డుతుంది. అలాగే పాల‌ల్లో యాల‌కుల పొడి, చిటికెడు కుంకుమ పువ్వును క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రింత చ‌క్క‌గా నిద్ర‌ప‌డుతుంది.
నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు గోరింట పూల గుత్తిని దిండు కింద పెట్టుకుని ప‌డుకోవ‌డం వ‌ల్ల గాఢ నిద్ర ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌నం నిద్రించే గ‌దిలో గాలి చ‌క్క‌గా వ‌చ్చి వెళ్లేట‌ట్టు ఉండాలి. 
అలాగే పూర్తిగా చీక‌టిగా ఉండ‌కుండ చూసుకోవాలి. 
గ‌దిలో చ‌క్క‌టి వాస‌న వ‌చ్చేలా చూసుకోవాలి. 
మ‌నం నిద్రించే మంచం ఎత్తుగా, విశాలంగా ఉండాలి. దూదితో త‌యారు చేసిన ప‌రుపుల‌ను ఉప‌యోగించాలి. దూది ప‌రుపు చ‌ల్లికాలంలో వెచ్చ‌గా, వేస‌వి కాలంలో చ‌ల్ల‌గా ఉంటుంది. దీని వ‌ల్ల నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. 
నిద్రించే పురుపు శుభ్రంగా ఉండాలి. మ‌లినాలు లేకుండా చూసుకోవాలి. నిద్రించ‌డం వ‌ల్ల మ‌న‌సు, శ‌రీరం శుభ్ర‌ప‌డ‌తాయి.
రోజూ ఒక స‌మ‌యాన్ని నిర్దేశించుకుని నిద్ర వ‌చ్చినా రాకున్నా ఆ స‌మ‌యానికి ప‌డుకోవాలి. మొద‌ట ఇలా స‌మ‌యానికి నిద్ర రాక‌పోయినా క్ర‌మంగా ఆ స‌మ‌యం కాగానే నిద్ర వ‌చ్చేస్తుంది. అలాగే నిద్రించే ముందు శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ చిట్కాల‌ను పాటిస్తూ మన‌సును ప్ర‌శాంతంగా ఉంచుకోవ‌డం వ‌ల్ల నిద్రలేమి స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు నిద్ర‌లేమి కార‌ణంగా వ‌చ్చే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.