Talambrala Mokka తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?

ఈ మొక్క పేరు Talambrala Mokka.. ఇది మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌నిపిస్తూనే ఉంటుంది. ఈ మొక్క ఎన్నో ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగి ఉంటుంది.

Talambrala Mokka తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?
Talambrala mokka


Talambrala Mokka : ఆయుర్వేద వైద్యం గురించి మీకు అవగాహన ఉంటే.. అసలు ఎలాంటి రోగాలను అయినా సులభంగా తగ్గించుకోవచ్చు.. ఇంగ్లీష్‌ మందులతో పనే లేకుండా తగ్గించుకోవచ్చు.. కానీ దురదృష్టం ఏంట్రా అంటే..మనం మన సంపదను నమ్మం.. అమ్మో నాటు వైద్యంతో చాలా ప్రమాదం అనుకుంటారు.. మన చుట్టూ ఉండే ఎన్నో మొక్కలు పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రులే.. మనం వాటిని పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు అని తీసి పడేస్తుంటాం.. ఈ మొక్కను కూడా అంతే.. రహదారుల వెంట, పొలాల్లో చాలా సార్లు చూసి ఉంటారు..కానీ ఏనాడైనా దాని వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకున్నారా..?

ఈ మొక్క పేరు Talambrala Mokka.. ఇది మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌నిపిస్తూనే ఉంటుంది. ఈ మొక్క ఎన్నో ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో దీనిని ఔష‌ధంగా ఉప‌యోగించి అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేస్తున్నారు. దీనిని అత్తాకోడ‌ళ్ల మొక్క‌, గాజు కుంప మొక్క అని కూడా అంటారు.. త‌లంబ్రాల మొక్క పొద‌లా 3 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ మొక్క పువ్వులు గుత్తులు గుత్తులుగా వివిధ‌ రంగుల్లో ఉంటాయి. ఈ మొక్క కాయ‌ల‌ను ప‌చ్చిగా ఉన్న‌ప్పుడు మాత్రం తిన‌కూడ‌దు. 

త‌లంబ్రాల మొక్క వల్ల లాభాలు..

  • మ‌న‌కు వ‌చ్చే 15 నుంచి 20 ర‌కాల వ్యాధుల‌ను తగ్గించ‌డంలో ఈ మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • త‌లంబ్రాల మొక్క ఆకులు నూనెను క‌లిగి ఉంటాయి. ఈ ఆకులు యాంటీ సెప్టిక్‌గా కూడా ప‌ని చేస్తాయి.
  • ఈ మొక్క నుండి తీసిన నూనెను గాయాల‌కు, పుండ్ల‌కు, దుర‌ద‌ల‌కు ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు.
  • గజ్జి, తామ‌ర వంటి చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో త‌లంబ్రాల మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఈ మొక్క స‌హాయ‌ప‌డుతుంది.
  • త‌లంబ్రాల మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి నొప్పి ఉన్న చోట ఉంచి క‌ట్టు క‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క్ర‌మంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
  • మ‌లేరియా వంటి జ్వ‌రాల‌ను, ద‌గ్గును, గ‌వ‌ద బిళ్ల‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఈ మొక్క స‌హాయ‌ప‌డుతుంది.
  • గ‌నేరియా, యుకోరియా వంటి లైంగిక సంబంధ‌మైన రోగాల‌ను న‌యం చేయ‌డంలో కూడా త‌లంబ్రాల మొక్క దోహ‌ద‌ప‌డుతుంది.
  • అజీర్ణం, ప్రొమ‌టైటిస్, క్ష‌య, జ‌లుబు, అధిక ర‌క్త పోటు, చ‌ర్మంపై ఉండే ద‌ద్దుర్ల‌ను త‌గ్గించ‌డంలో కూడా త‌లంబ్రాల మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • ఈ మొక్క ఆకుల ర‌సంలో వ‌స్త్రాన్ని త‌డిపి దానిని క‌ట్టుగా క‌ట్టుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, వాపులు, బెణుకులు త‌గ్గుతాయి.
  • ఈ మొక్క పువ్వుల‌కు దోమ‌ల‌ను త‌రిమే గుణం కూడా ఉంది. 

త‌లంబ్రాల మొక్క ఔష‌ధ గుణాల‌తోపాటు కొన్ని విష ప‌దార్థాల‌ను క‌లిగి ఉంటుంది. 

ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అనీ మీరు మొక్కను తెచ్చుకుని వాడేస్తాం అంటే కుదరదు.. ఆయుర్వేద నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మాత్ర‌మే ఉప‌యోగించాలి. ఈ మొక్క‌ను ఉప‌యోగించేట‌ప్పుడు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవసరం.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.