Hair ను హెల్తీగా ఉంచుకోవడం కోసం.. ఆడవాళ్లు తమ ఆఖరి రూపాయి వరకైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడరు. ఎన్నో oils, మరెన్నో షాంపూలూ మార్చుతూనే ఉంటారు. ఎవరికైనా Hair అందాన్ని ఇస్తుంది. మరి అలాంటి అందం చేచేజుతులా ఎవరైనా పోగుట్టుకుంటారా..? కానీ ఏం చేస్తాం.. మనం అదే చేస్తున్నాం.. అన్‌హెల్తీ లైఫ్‌స్టైల్ వల్ల జుట్టు రాలిపోతుంది. మరికొందరికి వారసత్వం ప్రభావం కూడా ఉంటుంది. అయితే జుట్టును బాగా పెంచాలంటే..ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోండి..మీరు వద్దన్నా జుట్టు పెరగడం మాత్రం ఆగదు...అంతబాగా పనిచేస్తుంది ఈ టిప్..
ఇంట్లోనే.. ఒక నూనె(Oil)ను తయారు చేసుకుంటే వాటితో జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడొచ్చు. దీని కారణంగా జుట్టు నల్లగా, వత్తుగా, ధృడంగా పెరుగుతుంది. కొబ్బరి నూనెను అలాగే మర్రి చెట్టు ఊడలను ఉపయోగించాలి. మర్రిచెట్టు ఊడలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
మర్రి చెట్టు ఊడలను తీసుకుని శుభ్రం చేయండి.. తర్వాత వాటిని రెండు మూడు రోజులు ఎండబెట్టండి...మర్రి ఊడలు పూర్తిగా ఎండాక ముక్కలు చేసి గ్రైండ్ చేయండి.. వాటిని పొడిగా చేయాలి.
ఆ తర్వాత కాస్త కొబ్బరి నూనె తీసుకుని.. వేడి చేయాలి. ఇందులో మిక్సీలో పట్టిన మర్రి ఊడల పొడిని వేసి బాగా కలపండి... ఆ తర్వాత చిన్న మంటపై కొబ్బరినూనె మర్రి ఊడల మిశ్రమాన్ని పెట్టి పూర్తిగా నల్లగా అయ్యే వరకూ ఉంచండి.. అనంతరం స్టౌవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఈ నూనెను వడకట్టి ఒక గాజు సీసాలో నిల్వ చేయండి.. ఈ నూనెను ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని కూడా నిల్వ చేయోచ్చు.
నూనెను జట్టు కుదుళ్ల నుంచి చివరి వరకూ అప్లై చేయాలి. కాస్త మర్దన చేయాలి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను జుట్టుకు పట్టించి ఉదయాన్నే తలస్నానం చేస్తే చాలు.. రోజంతా కూడా ఉంచుకోవచ్చు.. వారానికి రెండు సార్లు చేయండి. జుట్టు రాలడం తగ్గుతుంది.
జుట్టు ఒత్తుగా, నల్లగా పొడవుగా ఉంటుంది. అంతా బానే ఉంది కానీ.. ఇప్పుడు మర్రి ఊడలు ఎక్కడ నుంచి తేవాలనేగా మీ డౌట్.. సర్జికల్ షాపుల్లో దొరుకుతాయిగా..!