80కి పైగా రోగాలను నయం శక్తి వీటికి ఉందని మీకు తెలుసా..? 

తలనొప్పికి ఒక ట్యాబ్లెట్‌, జలుబుకు ఒకటి, బీపీకి ఒకటి, షుగర్‌కు ఇంకోటి.. ఇలా ఒక్కో సమస్యకు ఒక్కో ట్యాబ్లెట్‌ వాడాల్సి వస్తుంది. కానీ ఒక్క దానితోనే 80కి పైగా రోగాలను నయం చేసుకోవచ్చంటే నమ్ముతారా..? క్యాల్షియం లోపం, అధిక ర‌క్త‌పోటు, న‌రాల బ‌ల‌హీన‌త, శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం, న‌రాల్లో

80కి పైగా రోగాలను నయం శక్తి వీటికి ఉందని మీకు తెలుసా..? 


తలనొప్పికి ఒక ట్యాబ్లెట్‌, జలుబుకు ఒకటి, బీపీకి ఒకటి, షుగర్‌కు ఇంకోటి.. ఇలా ఒక్కో సమస్యకు ఒక్కో ట్యాబ్లెట్‌ వాడాల్సి వస్తుంది. కానీ ఒక్క దానితోనే 80కి పైగా రోగాలను నయం చేసుకోవచ్చంటే నమ్ముతారా..? క్యాల్షియం లోపం, అధిక ర‌క్త‌పోటు, న‌రాల బ‌ల‌హీన‌త, శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం, న‌రాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం వంటి స‌మ‌స్య‌ల‌న్నింటిని ఈ ప‌దార్థం త‌గ్గిస్తుంది. అంతేకాకుండా దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలన్నీ తొల‌గిపోతాయి.
Buy Coriander Seed / Kothamalli / Dhaniyalu / Haveeja / Dhaniya / Kothmir /  Dhanikataila Powder - hbkonline.in
అరిచేతులు, అరికాళ్ల‌ల్లో మంటలు, తిమ్మిర్లను త‌గ్గించ‌డంలో, క‌డుపులో మంట‌, గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఈ ప‌దార్థం మ‌న‌కు సహాయ‌ప‌డుతుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ప‌దార్థం మ‌రేమిటో కాదు ధ‌నియాలు. ఓర్ని ఇంత చెప్పిందా దీని గురించా అని తీసి పారేయకండి. మనం వంటల్లో మాత్రమే వాడే ధనియాలు.. గొప్ప ఔషధం గుణాలను కలిగి ఉన్నాయి. ధ‌నియాల‌ను స‌రైన ప‌ద్ద‌తిలో ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఎలా వాడితే ఏ సమస్యలు తగ్గుతాయో తెలుసుకుందామా..!
ధ‌నియాల‌తో క‌షాయాన్ని చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి అందులో 2 టేబుల్ స్పూన్ల ధ‌నియాల‌ను వేసి మూత పెట్టాలి. ఈ ధ‌నియాల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే ఈ నీటిని 5 నిమిషాల పాటు వేడి చేయాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి టీ తాగిన‌ట్టు తాగాలి. ఈ విధంగా ధ‌నియాల క‌షాయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది. న‌రాల్లో అడ్డంకులు తొల‌గిపోతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య అదుపులో ఉంటుంది. 
ధ‌నియాల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్, పొటాషియం వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. ధ‌నియాల‌తో చేసిన క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత క్యాల్షియం ల‌భిస్తుంది. ఎముక‌లు ధృడంగా అవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గి చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ధ‌నియాల క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. 
ఈ విధంగా ధ‌నియాల క‌షాయాన్ని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నుంచే షూరూ చేయండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.