బాడీలో ఎక్కడ కొవ్వు ఉన్నా.. ఈ ఆయిల్‌తో 15 రోజుల్లో కరిగించేయొచ్చు..!

బయట ఆహారాలు ఎక్కువగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో ఎక్కడపడితే అక్కడ కొవ్వు పెరిగిపోతుంది. ముఖ్యంగా నడుము, తొడలు, పొట్ట, పిరుదులు, చేతులు ఇలా కొన్ని భాగాల్లో.. కొవ్వు పేరుకుపోయి.. చూసేందుకు చాలా అంద వికారంగా కనిపిస్తారు. మంచి మంచి డ్రెస్లులు వేసుకుందాం అంటే.. ఇలా లావుగా ఉండటంతో.. అవి అంత చూసేందుకు ఏం బాగుండవు. వీటన్నింటికి ఏకైక

బాడీలో ఎక్కడ కొవ్వు ఉన్నా.. ఈ ఆయిల్‌తో 15 రోజుల్లో కరిగించేయొచ్చు..!


బయట ఆహారాలు ఎక్కువగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో ఎక్కడపడితే అక్కడ కొవ్వు పెరిగిపోతుంది. ముఖ్యంగా నడుము, తొడలు, పొట్ట, పిరుదులు, చేతులు ఇలా కొన్ని భాగాల్లో.. కొవ్వు పేరుకుపోయి.. చూసేందుకు చాలా అంద వికారంగా కనిపిస్తారు. మంచి మంచి డ్రెస్లులు వేసుకుందాం అంటే.. ఇలా లావుగా ఉండటంతో.. అవి అంత చూసేందుకు ఏం బాగుండవు. వీటన్నింటికి ఏకైక సొల్యూషన్‌..బరువు తగ్గడం.. బరువు తగ్గితే అన్నీ సెట్‌ అవుతాయి. సింపుల్‌ ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సులువుగా బ‌రువు త‌గ్గ‌డంతో పాటు శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును కూడా క‌రిగించుకోవ‌చ్చు తెలుసా..? శ‌రీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది ప‌డే వారు ఈ చిట్కాను పాటించడం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో 50 మిల్లీ గ్రాముల‌ ఆవ నూనెను తీసుకోవాలి. త‌రువాత ఈ ఆవ నూనెలో 20 మిల్లీ గ్రాముల కొబ్బ‌రి నూనెను క‌లపాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ వామును, ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క‌ను, త‌రువాత 4 క‌ర్పూరం బిళ్ల‌ల‌ను వేసి క‌లపాలి. త‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి చిన్న మంట‌పై 10 నిమిషాల పాటు వేడి చేయాలి. నూనె వేడిగా అయ్యే కొద్దీ దీని నుండి నురుగు రావ‌డాన్ని కూడా మ‌నం గమనించండి.. నూనెను వేడి చేసిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వ‌డ‌క‌ట్టి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత ఈ నూనెను ఒక గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి.
ఇలా నిల్వ చేసుకున్న నూనె నుండి 4 టీ స్పూన్ల నూనెను వేరే గిన్నెలోకి తీసుకోండి.. ఇలా తీసుకున్న నూనెను గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేయండి.. త‌రువాత ఈ నూనెలో 2 టీ స్పూన్ల అల్లం ర‌సాన్ని క‌ల‌పండి. త‌రువాత ఈ నూనెను కొద్ది కొద్దిగా తీసుకుంటూ కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయిన శ‌రీర భాగాల‌పై రాస్తూ 5 నిమిషాల పాటు నూనె శ‌రీరంలోకి ఇంకేలా బాగా మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత ఒక కాట‌న్ వ‌స్త్రాన్ని కానీ ప్లాస్టిక్ పేప‌ర్‌ను కానీ నూనె రాసిన శ‌రీర భాగం చుట్టూ చుట్టుకుని 3 నుండి 4 గంట‌ల పాటు అలాగే ఉండాలి. త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో శ‌రీరాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ చేయ‌డం వ‌ల్ల 15 రోజుల్లోనే పేరుకుపోయిన కొవ్వు క‌రిగి శ‌రీరంలో మార్పు రావ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. నూనెను వాడే ప్ర‌తిసారి కూడా అది గోరు వెచ్చ‌గా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చేతులు, పొట్ట‌, తొడ‌లు వంటి ఇత‌ర శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు. ఎలాంటి కష్టం లేకుండా ఇలా సింపుల్‌గా కొవ్వు కరిగించుకోవచ్చంటే అంతకు మించి ఏం కావాలి..? కాకపోతే ఇదంతా చేయడానికి ఓపిక, సహనం ఉండాలి..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.