Sweets before meals : ఆయుర్వేదం ప్రకారం..తీపి భోజనానికి ముందు తినాలా? తర్వాత తినాలా..?

అదేంటి తీపిని భోజనం చేసిన తర్వాతే కదా తినాలి.. ఏ కాదా అనుకుంటున్నారా..? ఆయుర్వేదం ప్రకారం తీపి ప‌దార్థాల‌ను ఎప్పుడు తినాలి ? అందుకు స‌రైన స‌మ‌యం ఏది ? భోజ‌నానికి ముందు వాటిని తినాలా ? లేక భోజ‌నం చేసిన త‌రువాత తీపి ప‌దార్థాల‌ను తినాలా అనేది ఇప్పుడు చూద్దాం..!

Sweets before meals : ఆయుర్వేదం ప్రకారం..తీపి భోజనానికి ముందు తినాలా? తర్వాత తినాలా..?
should sweet be eaten before meal or after meal


Best time to eat sweets : భోజనం చేసిన తర్వాత ఏదైనా స్వీట్‌ తింటే తిన్న ఆహారం త్వరగా అరిగిపోతుందని అంటారు. చాలామంది ఇదే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తున్నారు. కానీ ఆయుర్వేదం ప్రకారం.. తీపిని భోజనం చేసిన తర్వాత తినాలా, ముందే తినాలా.? ఆయుర్వేదంలో ఏం చెప్తున్నారో తెలుసా..? అదేంటి తీపిని భోజనం చేసిన తర్వాతే కదా తినాలి.. ఏ కాదా అనుకుంటున్నారా..? ఆయుర్వేదం ప్రకారం తీపి ప‌దార్థాల‌ను ఎప్పుడు తినాలి ? అందుకు స‌రైన స‌మ‌యం ఏది ? భోజ‌నానికి ముందు వాటిని తినాలా ? లేక భోజ‌నం చేసిన త‌రువాత తీపి ప‌దార్థాల‌ను తినాలా అనేది ఇప్పుడు చూద్దాం..!
ఆయుర్వేదం ప్ర‌కారం.. తీపి ప‌దార్థాల‌ను ఎల్ల‌ప్పుడూ భోజ‌నానికి ముందే తినాలి. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. జీర్ణ ర‌సాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి. మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కావ‌డంతోపాటు అందులో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. అందుక‌ని భోజ‌నానికి ముందే తీపి ప‌దార్థాల‌ను తినాలట.. భోజ‌నం చివ‌ర్లో వాటిని తింటే అజీర్ణం, గ్యాస్ స‌మ‌స్య‌లు వ‌స్తాయని ఆయుర్వేదంలో చెప్తున్నారు..

భోజ‌నం చేయ‌డానికి ముందు చిన్న బెల్లం ముక్క లేదా కొద్దిగా చ‌క్కెర లేదా ఇత‌ర తీపి పదార్థాల‌ను కొద్దిగా తిన‌వ‌చ్చు. ఇక కారంగా ఉండే ప‌దార్థాల‌ను భోజ‌నం చివ‌ర్లో తీసుకోవాలట..దీని వ‌ల్ల శ‌రీరంలో ఉండే క‌ఫం మొత్తం పోతుంది. శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇలా భోజ‌నం చేయాల్సి ఉంటుంది. అందుకే మనకు భోజనాల్లో కూడా ముందే స్వీట్‌ వేస్తారు.
ముందుగా తీపి ప‌దార్థాలను తినాలి. దీంతో జీర్ణ‌ర‌సాలు ఉత్ప‌త్తి అయి తిన్న ఆహారం జీర్ణ‌మ‌వుతుంది. త‌రువాత పులుపు, వ‌గ‌రు, ఉప్పుగా ఉండే ప‌దార్థాల‌ను తినాలి. చివ‌ర్లో కారంగా ఉండే ఆహారాల‌ను తినాలి. దీంతో క‌ఫం త‌గ్గుతుంది. ఇలా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఇప్పటి వరకూ చాలా మంది భోజనం చేసిన తర్వాత స్వీట్‌ తింటే మంచిది అనుకుంటున్నారు.. భోజనానికి ముందే స్వీట్‌ తింటే అన్నం ఎక్కువ తినలేం అని వాదన కూడా చాలమందిలో ఉంది. భోజనానికి అరగంట ముందు స్వీట్‌ తింటే.. పైన చెప్పినట్లు శ్వాసకోస సమస్యలు, కఫం ఉండదు. ఈసారి నుంచి ఇలా ట్రై చేసి చూడండి..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.