Food to get more blood : బాడీలో రక్తం తక్కువగా ఉందా..? వీటిని తినండి చాలు..!!

Food for blood : ఈరోజుల్లో చాలా మందికి సరిపడా రక్తం ఉండటం లేదు. ముఖ్యంగా మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపంతోపాటు మహిళలకు నెలసరి సమయంలో, గర్భం దాల్చినప్పుడు రక్తహీనత సమస్య వస్తుంటుంది.

Food to get more blood : బాడీలో రక్తం తక్కువగా ఉందా..? వీటిని తినండి చాలు..!!
Eat this food to get more blood


Food for blood : ఈరోజుల్లో చాలా మందికి సరిపడా రక్తం ఉండటం లేదు. ముఖ్యంగా మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపంతోపాటు మహిళలకు నెలసరి సమయంలో, గర్భం దాల్చినప్పుడు రక్తహీనత సమస్య వస్తుంటుంది. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం త్వరగా తయారవుతుంది. మరి రక్తం పెరిగేందుకు ఏయే ఆహారాలను తీసుకోవాలో చూద్దామా..!
మన శరీరంలో రక్తం బాగా తయారు కావాలంటే ఐరన్‌ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారాలు ఏంట్రా అంటే... పాలకూర, గోంగూర, పుట్టగొడుగులు, యాపిల్స్, టమాటాలు, బాదంపప్పు, పెసలు, జీడిపప్పు, సోయా, కిస్మిస్‌, డార్క్‌ చాకొలెట్‌, యాలకులు, విత్తనాలు, గుడ్లు, చికెన్, మటన్‌, చేపలు.. వంటి ఆహారాల్లో మనకు ఐరన్‌ అధికంగా లభిస్తుంది. అలాగే బీట్‌రూట్‌లోనూ అధికంగా ఐరన్‌ ఉంటుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
రోజూ పాలకూర, క్యారెట్‌, బీట్‌రూట్‌, యాపిల్‌ వంటి కూరగాయలు, పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లను తాగుతుంటే రక్తం త్వరగా తయారవుతుంది.

రోజూ ఉదయాన్నే పరగడుపునే అరకప్పు బీట్‌రూట్‌ జ్యూస్‌, అర కప్పు ఉసిరికాయ జ్యూస్‌.. రెండింటినీ కలిపి కప్పు మోతాదులో తాగాలి. దీంతో రక్తం వేగంగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడతారు.
రోజూ మధ్యాహ్నం సమయంలో ఒక గ్లాస్‌ దానిమ్మ పండు రసం తాగాలి. లేదా రోజుకు ఒక దానిమ్మ పండును తినాలి. ఇవి రక్తాన్ని పెంచేందుకు తోడ్పడుతాయి.
రాత్రిపూట మజ్జిగలో కొద్దిగా కరివేపాకు పొడి కలిపి తాగడం వల్ల కూడా రక్తం తయారవుతుంది.
విటమిన్‌ బి12 వల్ల కూడా బాడీలో రక్తం తయారవుతుంది. విటమిన్ బి12 అధికంగా ఉండే చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, మటన్‌ లివర్‌ వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇవన్నీ రక్తాన్ని పెంచుతాయి. రక్తహీనత నుంచి బయట పడేస్తాయి.
శరీరంలో రక్తం సరిపడా లేకపోతో చాలా సమస్యలు వస్తాయి.. అసలు మీకు రక్తం ఏంతుందో తెలియాలంటే.. వైద్యులను సంప్రదిస్తే చాలు.. అరచేతులు, కళ్లు తెల్లగా ఉంటే రక్తం తక్కువగా ఉన్నట్లే.. ఒక మనిషిలో రక్తం తక్కువగా ఉంటే.. పాలిపోయినట్లు ఉంటారు. నీరసం అయిపోతారు. ఆ ఆహారాలను తరచూ తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.