Ulcer : అల్సర్ వేధిస్తుందా.. గుండెల్లో మంట తగ్గడం లేదా.. వంటింటి వైద్యంతో వెంటనే చెక్ పెట్టండి..

Ulcer మనిషిని నిలువెల్లా ఇబ్బంది పెట్టే సమస్య. గుండెల్లో విపరీతంగా మంట వస్తూ ఉంటుంది. తినకపోతే మంట పెడుతుంది తింటే కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. నెలలు గడుస్తున్నా కొన్నిసార్లు తగ్గకుండా ఉంటుంది.

Ulcer  :  అల్సర్ వేధిస్తుందా.. గుండెల్లో మంట తగ్గడం లేదా.. వంటింటి వైద్యంతో వెంటనే చెక్ పెట్టండి..
Ulcer


Ulcer మనిషిని నిలువెల్లా ఇబ్బంది పెట్టే సమస్య. గుండెల్లో విపరీతంగా మంట వస్తూ ఉంటుంది. తినకపోతే మంట పెడుతుంది తింటే కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. నెలలు గడుస్తున్నా కొన్నిసార్లు తగ్గకుండా ఉంటుంది. ఎంతగానో వేధించే ఈ సమస్యతో వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతోనే తేలికగా తగ్గించుకోవచ్చు అని తెలుస్తోంది.
ముఖ్యంగా అల్సర్ ఎందుకు వస్తుంది అంటే జీర్ణశయంలో తిన్న ఆహారం జీర్ణం కాకుండా ఉండిపోతుంది. ఆ సమయంలో పేగులు కదలికలో కొన్ని హెచ్చుతగ్గులు ఏర్పడటం వల్ల విష పదార్థాలుగా మారుతాయి. ఆ సమయంలోనే పొట్టలో యాసిడ్ విడుదలవుతుంది. ఇది కొన్ని మార్పులు జరిగి జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడటం జరిగి కడుపులో మంటగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇది గుండెకి పొట్టకీ మధ్యలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పరుస్తుంది. ఈ సమయంలో కొందరిలో విపరీతంగా కడుపులో నొప్పి, మంట, వికారం, వాంతులు, తలనొప్పి, కడుపు ఉబ్బరంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కొన్నిసార్లు చిన్న పేగుల్లో లేదా జీర్ణాశయం మధ్యలో కొన్ని రకాల పండ్లు ఏర్పడతాయి. వీటిని ఏమాత్రం జాగ్రత్త చేసిన పెను ప్రమాదం. అన్నం తిన్న వెంటనే నొప్పి వస్తే అది మంటతో పాటు ఉంటే కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి. 
మన వంటింట్లోనే దొరికే ఎన్నో రకాల అద్భుత ఔషధాలతో కడుపులో అల్సర్ ను చాలా తేలికగా తగ్గించుకోవచ్చు.
ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే వెన్న తీసేసిన మజ్జిగలో ఒక చెంచా పంచదార కొంచెం జీలకర్ర అల్లం వేసి తాగితే కడుపులో మంట అదుపులో ఉంటుంది.
అలాగే కడుపులో బాగా మంటగా అనిపిస్తున్నప్పుడు మజ్జిగ పోసుకొని అన్నం తిని.. మిరియాలు, జీలకర్ర, పిప్పళ్ళు, సొంటి కలిపి చేసిన ఉసిరికాయ అంత ఉండను మింగటం వల్ల కడుపులో నొప్పి వెంటనే తగ్గిపోతుంది.
కొన్నిసార్లు కడుపులో మంట గుచ్చుతున్నట్టుగా నొప్పిగా అనిపిస్తుంది. ఈ సమయంలో వెల్లుల్లి రసంలో కొంచెం ఇంగువ కలుపుకొని తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.
అన్నం ఉడుకుతున్నప్పుడు వచ్చే నీళ్లను ఒక అర గ్లాసు తీసుకొని అందులో రెండు చెంచాల స్వచ్ఛమైన నెయ్యి వేసి తాగితే కడుపులో ఏర్పడ్డ ఎలాంటి పుండ్లు అయినా తగ్గిపోతాయి.
కడుపులో మంటగా అనిపిస్తున్నప్పుడు దానిమ్మ పళ్ళు అక్రూట్ తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది.
చాలామంది వెలగపళ్లను తినరు. కానీ అందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కడుపులో మంటకు చెక్ పెట్టడంలో  వెలగపండు ముందు ఉంటుంది. ఈ సమయంలో ఇవి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
అలాగే సొంటి, నువ్వులు, బెల్లం సమంగా నూరి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పాలతో తాగితే కడుపులో ఉన్న ఎలాంటి అల్సరైనా మంటలైన తగ్గిపోతాయి..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.