ఊబకాయంతో విసిగిపోయి సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదమే..!

సమయానికి తినకపోవడం నిద్ర వేళాలు సరిగ్గా ఉండకపోవడం పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలతో చాలావరకు బాధపడుతూ వస్తున్నారు అంతేకాకుండా తీసుకునే ఆహారం కుటుంబం అబద్దం కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది

ఊబకాయంతో విసిగిపోయి సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదమే..!


సమయానికి తినకపోవడం నిద్ర వేళాలు సరిగ్గా ఉండకపోవడం పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలతో చాలావరకు బాధపడుతూ వస్తున్నారు అంతేకాకుండా తీసుకునే ఆహారం కుటుంబం అబద్దం కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అయితే ఊబకాయం తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుకోసం వ్యాయామం చేయటం సరేనా పోషకాహారం తీసుకోవడం డైట్ ఫాలో అవ్వటం వంటివి చాలా ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ కొందరు బరువు తగ్గకపోవడంతో సర్జరీ చేయించుకోవడమే సరైన మార్గం అనుకుంటారు అయితే ఈ విషయంలో మాత్రం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది.

World Obesity Day 2023: ఊబకాయం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందా? ఎలా? |  World Obesity Day 2023: Obesity And Kidney Health: Here's How The Two Are  Linked To Each Other - Telugu BoldSky

నిజానికి అధిక బరువుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ సర్జరీ చేయించుకోవడానికి వారి శరీర తత్వం సరిపడదు. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి అందుకే ప్రతి ఒక్కరూ సర్జరీ చేయించుకోవడం సరైన విషయం కాదు. ఎందుకోసం ఆరోగ్యాన్ని పనులు ఏం చెప్తున్నారంటే.  
ఒబేసిటీతో వచ్చిన ప్రతి వ్యక్తీ నేరుగా బేరియాట్రిక్‌ సర్జరీకి వెళ్లటానికి వీలు లేదు. ముందుగా రోగికి ఒబేసిటీ అనే పదానికి వైద్యపరమైన అర్ధాన్ని విడమర్చి చెప్పి, ఒబేసిటీ చికిత్సా విధానాలను వైద్యులు వివరిస్తారు. ఇందుకోసం మొదట డైట్‌ ప్లాన్‌ సూచిస్తారు. అలాగే శరీరంలో ఎంత కొవ్వు ఉందో తెలుసుకోవటం కోసం ‘ఫ్యాట్‌ స్కాన్‌’ చేస్తారు. దాన్ని అనుసరించి, రోగి బాడీ మాస్‌ ఇండెక్స్‌కు తగిన క్యాలరీలను లెక్కించి అందుకు తగిన ఆహార నియమాలను సూచిస్తారు.

ఈ సర్జరీ ఎవరికి అవసరం అంటే.. 

సాధారణంగా బిఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) 40 కంటే ఎక్కువ ఉన్నవాళ్లకు బేరియాట్రిక్‌ సర్జరీని వైద్యులు సూచిస్తారు. బిఎమ్‌ఐ 40 కంటే ఎక్కువ ఉన్న సూపర్‌ ఒబేస్‌, అంతకంటే ఎక్కువ ఉన్న సూపర్‌ సూపర్‌ ఒబేస్‌, మార్బిడ్‌ ఒబేస్‌ రోగులూ ఉంటారు. కానీ 40 బిఎమ్‌ఐ అనేది అమెరికన్‌ ప్రజల శరీర తీరును బట్టి నిర్ణయించారు. కాబట్టి ఈ లెక్కను ప్రపంచవ్యాప్తంగా అనుసరించటం సరికాదు. మరీముఖ్యంగా ఆసియా దేశాల ప్రజల్లో బిఎమ్‌ఐ 27 – 28 ఉన్నా ఒబేసిటీగానే పరిగణించాల్సి ఉంటుంది. వీళ్లందరికీ వారి వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా ఏడు రకాల బేరియాట్రిక్‌ సర్జరీలను ఎంచుకుంటారు. ఇంతకంటే తక్కువ బిఎమ్‌ఐ ఉండి, మందులతో మెటబాలిక్‌ డిజార్డర్లు అదుపులోకి రాకుండా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉన్నప్పుడు కూడా బేరియాట్రిక్‌ సర్జరీ తప్పనిసరి అవుతుంది. ఈ సర్జరీ వల్ల ఎండోక్రైన్‌ సిస్టమ్‌ పనితీరు మెరుగవుతుంది. దాంతో సుగర్‌, రక్తపోటు, థైరాయిడ్‌ లాంటి సమస్యలు సర్దుకుని ఆరోగ్యం సమకూరుతుంది. ఎవరైతే చాలాకాలం పాటు మందులు ఉపయోగించి అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యే ఉంటారు వారు వైద్యం సలహా మేరకు ఈ సర్జరీ చేయించుకోవచ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.