రోజూ ఎంత నీరు తాగుతున్నారు.. ఎప్పుడైనా ఆలోచించారా.. శరీరంలో నీరు తక్కువే కాదు ఎక్కువైనా ప్రమాదమే!

నీరు.. జీవ ఔషధీ.. ఈ భూమ్మీద దొరికే అత్యంత విలువైన నీరు సమస్త ప్రాణకోటికి ఎంతో అవసరం అయినా నీరు సరిగ్గా తీసుకోకపోతే ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయని తెలిసిందే ఒకరోజు కనీసం ఒక గంట కూడా నీటిన తాగకుండా ఉండలేరు అయితే నీరు తక్కువగా తాగితే ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో ఎక్కువగా తీసుకుంటే కూడా అన్ని సమస్యలు వస్తాయని తెలుస్తోంది...

తీసుకోవలసిన దానికన్నా ఎక్కువగా నీటిని శరీరానికి తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి అందులో ముఖ్యంగా..

అధికంగా నీటిని తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్య వేధిస్తుందని తెలుస్తోంది అయితే తలనొప్పి బాధించేవారు నీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది కానీ అంతకుమించి తీసుకోవడం వల్ల అవిపరితంగా తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

తిన్న వెంటనే లేదా పడుకునే ముందు అత్యంత ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు తలెత్తి అవకాశం ఉంది ముఖ్యంగా వాంతులు అవ్వటం ఉదరం భాగంలో ఇబ్బందిగా అనిపించడం అంటే లక్షణాలు కనిపిస్తాయి.

ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల ఆ ప్రభావం మూత్రపిండాల పైన పడుతుంది దీనివలన శరీరం అలసటకు గురవుతుంది. అలాగే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఆహారం తీసుకోవాల్సిన సమయంలో సైతం ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల తగినంత ఆహారాన్ని శరీరానికి అందించలేరు. దీని వలన శరీరం కావాల్సిన పోషకాలను అందుకోలేక నీరసం అలసట వంటి సమస్యలు దరి చేరుతాయి.

శరీరంలో తిమ్మిర్లు ఏర్పడటం నడుస్తుంటే కాలభాగంలో ఏదో ఇబ్బందిగా అనిపించడం కంటికి సంబంధించిన కొన్ని రకాల సమస్యలు తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తాయి అందుకే రోజు కచ్చితంగా రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలని సూచిస్తారు కానీ అంతకుమించి ఎక్కువ నీటిని మాత్రం తాగకూడదని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.