ఇలా చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవ్వడంతో పాటు.. చక్కటి నిద్ర పడుతుంది..

ఈరోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటు.. నిద్రలేమి సమస్య కూడా ఒకటి.. ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది..ఈ నిద్రలేమి వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్రలేమి ఊబకాయం, ఒత్తిడి, గుండె జబ్బులు, ఆందోళన

ఇలా చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవ్వడంతో పాటు.. చక్కటి నిద్ర పడుతుంది..


ఈరోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటు.. నిద్రలేమి సమస్య కూడా ఒకటి.. ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది..ఈ నిద్రలేమి వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్రలేమి ఊబకాయం, ఒత్తిడి, గుండె జబ్బులు, ఆందోళన వంటి ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. నిద్రతోనే మన శరీరం తిరిగి శక్తివంతంగా మారుతుంది. ఎనర్జిటిక్ గా పనులు చేసుకుంటారు. నిద్రలేమి మతిమరుపునకు కూడా కారణమవుతుంది. అయితే మన జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే రాత్రిళ్లు హాయిగా, ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపడుతుంది. బాగా నిద్రపట్టడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

100+ Sleep Pictures | Download Free Images on Unsplash

పడుకునే గంట లేదా అరగంట ముందు నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకండి. పడుకునే అరగంట ముందే టీవీని ఆఫ్ చేయండి. డిమ్ లైట్లను ఆన్ చేయండి. పడుకునే ముందు బుక్ చదవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీరు రాత్రిళ్లు హాయిగా నిద్రపోతారు.

కెఫిన్ కంటెంట్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది నిద్రపట్టకుండా చేస్తుంది. కాఫీ లేదా టీ ని రాత్రిపూట అస్సలు తాగకండి. ముఖ్యంగా సాయంత్రం తర్వాత కాఫీని గానీ, టీని గానీ ఎక్కువగా తాగకండి. ఒకవేళ తాగితే మీ నాడీ వ్యవస్థ చురుగ్గా మారతుంది. దీనివల్ల మీరు రాత్రిపూట తొందరగా నిద్రపోరు. అందుకే సాయంత్రం 6 తర్వాత టీ కానీ, కాఫీ కానీ తాగకండి..

ఆరోగ్యకరమైన ఆహారం ఒత్తిడిని తగ్గించడానికి, రాత్రిళ్లు హాయిగా పడుకోవడానికి సహాయపడుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించండి. లేదా రాత్రిళ్లు మొత్తమే తినకండి. ఆల్కహాల్ వినియోగాన్ని కూడా పరిమితం చేయండి. వీలైనంత ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ప్రోటీన్లను తినండి. ఇవి మీరు ఆరోగ్యంగా ఉండటానికి, రాత్రిళ్లు ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడతాయి..

ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ జీవక్రియ కూడా బాగుంటుంది. అలాగే మీ మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సూర్యోదయానికి నిద్రలేవడం, రాత్రి 10 గంటలకు పడుకోవడం అలవాటు చేసుకుంటే మీరు కంటినిండా నిద్రపోతారు... ఆరోగ్యం కూడా బాగుంటుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.