చెవిలో గులమి తీస్తున్నారా.. జాగ్రత్త సుమా.. !

అయితే చెవి లో గులమి ఉండటం మంచిదేనని.. ఇది బయట ఉన్న సూక్ష్మజీవులను Ear లోపలికి పోకుండా రక్షిస్తుందని చాలా మందికి తెలియదు.. దీనివల్ల గులిమిని అసౌకర్యంగా భావించి దాన్ని తీయటానికి ఏదో ఒక వస్తువు Earలో పెడుతూ ఉంటారు.

చెవిలో గులమి తీస్తున్నారా.. జాగ్రత్త సుమా.. !
Be careful while removing ear wax


శరీరంలో చెవి  ఎంతో ముఖ్యమైన భాగం.. ముఖ్యంగా దీని విషయంలో ఎలాంటి అజాగ్రత్త వహించిన వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే చాలా మందికి Ear లోపల ఉండే wax ని తీసే అలవాటు ఉంటుంది. అయితే ఇది ఎంత మాత్రం మంచి అలవాటు కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. 

చాలా మంది అదే పనిగా చెవిలో ఏదో ఒక వస్తువు పెట్టి గులిమిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే చెవిలో గులిమి ఉండటం మంచిదేనని.. ఇది బయట ఉన్న సూక్ష్మజీవులను చెవి లోపలికి పోకుండా రక్షిస్తుందని చాలా మందికి తెలియదు.. దీనివల్ల గులిమిని అసౌకర్యంగా భావించి దాన్ని తీయటానికి ఏదో ఒక వస్తువు చెవిలో పెడుతూ ఉంటారు. దీని వలన విపరీతమైన చెవి నొప్పి, ఇన్ఫెక్షన్స్ రావడమే కాకుండా వినికిడి సమస్యలు సైతం తలెత్తుతాయి.. అయితే మరి అలవాటు అయినవారు ఇబ్బందిగా అనిపిస్తున్న సమయంలో గులిమిని తీయటానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదని తెలుస్తోంది అవి ఏంటంటే.. 

ముఖ్యంగా స్విమ్మింగ్ చేసేటప్పుడు షవర్ కింద స్నానం చేసేటప్పుడు చెవి లోపలికి నీరు వెళ్లకుండా చూసుకోవాలి.. లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.. అలాగే ఏదో ఒక వస్తువులను నిరంతరం చెవిలో పెట్టడం అసలు మంచి పద్ధతి కాదు. దీని వలన ఆ వస్తువులపై ఉండే బ్యాక్టీరియా మొత్తం చెవిలోకి చేరుతుంది. అంతేకాకుండా కర్ణభేరి దెబ్బతినే అవకాశం సైతం ఉంది. అలాగే దీన్ని తీయడానికి చెవి నాళం కన్నా పెద్ద పరిమాణంలో ఉన్న వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.. బయట ఎవరైనా కొలిమి తీస్తాము అంటే వారిని నమ్మి చెవిని అప్పగించకూడదు. నొప్పి లేకుండా మనకు మనమే తీయగలం అనిపించిన పరిస్థితుల్లో మాత్రమే ప్రయత్నించాలి.. 

అలాగే ఈ చిన్న విషయమే కదా అని ఆ జాగ్రత్త వహించకుండా వైద్యుల్ని సంప్రదించటమే ఉత్తమమైన మార్గం.. అలాగే గులిమి ఎండిపోయిందని చాలామంది వెల్లుల్లి నూనె, ఆముదం వంటివి చెవిలో వేస్తూ ఉంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా గాలి తగలడం వల్ల చెవిలో నొప్పి వస్తూ ఉంటుంది. అయితే చెవిలో గులిమి ఉన్నప్పుడు ఈ గాలి లోపలికి పోకుండా అడ్డుకోవడమే కాకుండా తలకు సంబంధించిన ఎన్నో సమస్యలు రాకుండా కాపాడుతుంది.. చల్లని వాతావరణం లో ఉన్నప్పుడు కూడా చెవి లోపలికి విపరీతంగా గాలి వెళ్లిపోయి నొప్పి వస్తుంది... అలాగే చిన్న పిల్లలకు తలస్నానం చేయించిన వెంటనే క్లాత్ పెట్టి, చిన్న చిన్న వస్తువులు పెట్టు చెవులను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల వారికి దీర్ఘకాలం ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి చెవులను పట్టి లాగకుండా నెమ్మదిగా శుభ్రం చేసే అవకాశం ఉంటే ప్రయత్నించాలి.. లేదంటే ఆ పనిని మానుకోవడం ఉత్తమం..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.