చిన్నపిల్లల్లో నత్తి సమస్య ఎందుకు వస్తుంది..? దీనికి చికిత్స ఏంటి..?

చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే.. భలే ఉంటుంది కదా. వాళ్లు ఏం మాట్లాడుతున్నారో అర్థంకాకపోయినా అలానే వింటాం. వాళ్ల నోటి ఉంచే ప్రతి పదం మనకు ఎక్కడలేని ఆనందాన్ని ఇస్తుంది. కానీ పిల్లలు

చిన్నపిల్లల్లో నత్తి సమస్య ఎందుకు వస్తుంది..? దీనికి చికిత్స ఏంటి..?


చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే.. భలే ఉంటుంది కదా. వాళ్లు ఏం మాట్లాడుతున్నారో అర్థంకాకపోయినా అలానే వింటాం. వాళ్ల నోటి ఉంచే ప్రతి పదం మనకు ఎక్కడలేని ఆనందాన్ని ఇస్తుంది. కానీ పిల్లలు పెరిగేకొద్ది వాళ్ల మాటతీరు మారుతుంది. స్పష్టంగానే మాట్లాడతారు. కొంతమంది పిల్లలు మాత్రం ఎదుగుతున్నా నత్తిగానే మాట్లాడతారు. అదే సమస్య అలానే కొనసాగితే వాళ్లు పెద్దవాళ్లు అయినా నత్తిగానే మాట్లాడతారు. అసలు చిన్నపిల్లలు నత్తిగా మాట్లాడటానికి కారణం ఏంటి..? కొంతమంది వారసత్వంగా కూడా ఈ సమస్య వస్తుంది అనుకుంటారు. సరే ఈ విషయం పక్కనపెడితే.. ఈ సమస్య రావడానికి కారణాలు ఏంటో పరిశీలిద్దాం. 
Stuttering – You're Not Alone - Speech & OT
నత్తి ఎక్కువగా అబ్బాయిల్లోనే కనిపిస్తుంది. రెండు నుంచి ఐదు ఏళ్ల వయసులో అధికంగా ఈ నత్తి వస్తుంది. వీరిలో ఏడేళ్ల వయసు వచ్చేసరికి దానంతట అదే పోతుంది. కానీ ఒక శాతం మందిలో మాత్రం పెద్దయ్యాక కూడా నత్తి వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారికి జీవితాంతం ఆ సమస్య ఉంటుంది.

నత్తి ఉన్న పిల్లలు అమాయకులు అనుకుంటున్నారా..?

నత్తి ఉన్న పిల్లలు అమాయకులుగా కొంతమంది భావిస్తారు. నిజానికి నత్తికి, తెలివితేటలకు ఏం సంబంధం లేదు. సాధారణ పిల్లల కన్నా కూడా నత్తి ఉన్న పిల్లలు మరింత తెలివిగా వ్యవహరిస్తారు. అయితే మాట్లాడడానికి అవసరమైన కండరాల మధ్య సమన్వయ లోపం తక్కువగా ఉన్నా, సమన్వయం సరిగా కుదరకపోయినా కొన్ని అక్షరాలు సరిగా పలకలేరు. అదే నత్తి. దీంతో వారు మాట్లాడుతున్నప్పుడు కాస్త గాబరా పడతారు. నత్తి జన్యుపరంగా కూడా రావొచ్చు. కొన్ని కుటుంబాల్లో వారసత్వంగా నత్తి రావడం సహజం. నత్తి ఉన్న వారిలో తెలివితేటలు పుష్కలంగా ఉండే అవకాశం ఎక్కువ.
చికిత్స ఎలా ఉంటుంది..?
పిల్లల్లో నత్తి అధికంగా ఉంటే.. వారికి స్పీచ్ థెరపీ ఇప్పిస్తే ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. నత్తికి ఇంతవరకు ఔషధం లేదు. రావడం కూడా కష్టమే. ఇంట్లో పిల్లలతో తల్లిదండ్రులు అధికంగా మాట్లాడుతూ, వారి చేత అక్షరాలను పదేపదే పలికిస్తూ ఉంటే నత్తి సమస్య తగ్గే ఛాన్స్‌ ఉంది. వేగంగా మాట్లాడుతున్న పిల్లల్లో నత్తి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి పిల్లలు నెమ్మదిగా మాట్లాడేలా తల్లిదండ్రులు అలవాటు చేయాలి. నత్తి ఎక్కువగా ఉన్న పిల్లలకు సంగీతం నేర్పించడం, పాటలు పాడించడం వంటివి చేస్తే ఆ సమస్య కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. ఐదేళ్ల లోపే నత్తిని గుర్తిస్తే స్పీచ్ థెరపీని ఇప్పించండి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.