Healthy Kidneys : కిడ్నీ ఆరోగ్యానికి పాటించాల్సినవి.. ఉప్పు వ‌ద్దంటే వ‌ద్దు

కిడ్నీలు ఆరోగ్యకరంగా పనిచేయాలంటే.. మన అలవాట్లను కొన్ని ఎలా మార్చుకుంటే మంచిదో ఈరోజు చూద్దాం. ప్రతిరోజు మంచినీళ్లు బాగా త్రాగడం. ఆడవారు 4 లీటర్లు, మగవారైతే 4.5-5 లీటర్ల వరకు తాగటం మంచిది. healthy kidneys

Healthy Kidneys : కిడ్నీ ఆరోగ్యానికి పాటించాల్సినవి.. ఉప్పు వ‌ద్దంటే వ‌ద్దు


కిడ్నీలు ఆరోగ్యకరంగా పనిచేయాలంటే.. మన అలవాట్లను కొన్ని ఎలా మార్చుకుంటే మంచిదో ఈరోజు చూద్దాం. కిడ్నీలు ఒక గంట వ్యవధిలో ఐదులీటర్ల రక్తాన్ని రెండు సార్లు శుద్దిచేస్తాయి. కిడ్నీలు చెడిపోకుండా మంచిగా ఫిల్టర్ చేయాలి అంటే ఫస్ట్ మనం మార్చుకోవాల్సిన అలవాటు ప్రతిరోజు మంచినీళ్లు బాగా త్రాగడం. ఆడవారు 4 లీటర్లు, మగవారైతే 4.5-5 లీటర్ల వరకు తాగటం మంచిది. అలా నీళ్లు ఎక్కువగా తాగినప్పుడు మన శరీరం అవసరాలకు వాడుకోగా.. కొన్ని ఎక్కువ అవుతాయి. అలా ఎక్కువైన వాటర్ ని కిడ్నీలు ఆ నీళ్లను మూత్రం ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేస్తాయి.

ఆరోగ్య‌క‌ర‌మైన కిడ్నీల కోసం మంచి నీళ్లు

Benefits of Drinking Water

నీళ్లను పంపించేప్పుడు ఆ నీళ్లలో రక్తాన్ని వడకట్టినప్పుడు వచ్చిన పనికిరాని కాలుష్యపదార్థాలను, ఎక్కువైన లవణాలను, కెమికల్సను మూత్రంలో పెట్టి పంపిచేస్తాయి. మూత్రం బాగా వస్తేనే కిడ్నీలు ఫిల్టర్ చేసిన వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. కొంతమంది ఎక్కువ వాటర్ తాగితే మూత్రం ఎక్కువసార్లు వెళ్లాలని వాటర్ తాగరు. మరికొందరు మూత్రాన్ని ఆపుకుంటారు. అప్పుడు కిడ్నీలు ఫిల్టర్ చేసిన వేస్ట్ మెటిరీయల్ అంతా వెనక్కు వదిలేస్తాయి. అలా కిడ్నీలు చేసిన పనినే మళ్లీ చేయాల్సి వస్తుంది. 

అలా కాకుండా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తే కిడ్నీలు ఎప్పటికప్పుడు రక్తాన్ని శుద్ది చేసి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. యూరిన్ అనేది వ్యర్థాలు మోసుకెళ్లేది అలాంటిది ఆపుకుంటే చెడు అంతా లోపలికి వెళ్తుంది. రెండు కిడ్నీలు పనిచేస్తున్నప్పుడు దాని విలువ ఎవరికి తెలియదు. ఎప్పుుడైతే కిడ్నీలు చెడిపోతాయే అప్పుడు డయాలసిస్లు, ఆసుపత్రికి మూడు నాలుగు రోజులకోసారి తిరుగుతూ.. వేలకు వేలు బిల్లు అవుతూ.. కిడ్నీలు ట్రాస్ప్ ప్లేటేషన్ అన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది.. కిడ్నీలు అశ్రద్ధ చేసినవారికి. కానీ కిడ్నీ ఒక్కసారి చెడిపోయిన తర్వాత రిపేర్ అవ్వదు. లివర్ అయితే ఎంత చెడిపోయినా దానికి సరైన పోషకవిలువలు అందిస్తే మళ్లీ లైన్ లో పడుతుంది. కానీ కిడ్నీలు అలాకాదు. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నీళ్లు బాగా తాగాలి.

ఉప్పు వ‌ద్దంటే వ‌ద్దు.. ఉప్పు మానేస్తే కిడ్నీలు క్లీన్‌

యూరిన్ బాగా పాస్ చేయాలి. కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రధానంగా చెడు చేసేది సాల్ట్. ఎక్కువైన ఉప్పు అంతా కిడ్నీలే విసర్జించాలి. ఈ ఉప్పు కిడ్నీ కణజాలాన్ని, ఫిల్టర్స్ ని డామేజ్ చేస్తుంది. బీపీ ఎక్కువైపోతు ఉంటుంది. బీపీ పెరిగితే కిడ్నీలు డామేజ్ అయిపోతాయి. డయబెటీస్ ఎక్కువైపోతే కిడ్నీలు డామేజ్ అయిపోతాయి. అందుకే కిడ్నీలు డామేజ్ అయిన తర్వాతా డాక్టర్లు అదేపనిగా చెప్తారు. ఉప్పు మానేయమని.

ఎక్కువైన ఉప్పును విసర్జించడానికి కిడ్నీలు 40-50 శాతం ఎనర్జీని వేస్ట్ చేయాల్సి వస్తుంది. అదే మీరు ఉప్పు వాడకం తగ్గిస్తే.. కిడ్నీలకు ఎంత శ్రమతగ్గుతుంది. టేస్ట్ కోసం అని జామకాయలు, పుచ్చకాయలు, ఆవకాయలు, మొక్కజొన్నకండెలు ఇలా అన్నింటి మీద వాడుతూ ఉప్పులో మునిగితేలుతున్నాం. మన బాడీకి కావలిసిన ఉప్పు 400మిల్లీగ్రాముల సోడియం అంతే. అలాంటిది మనం దగ్గరదగ్గర 4000-5000మిల్లీగ్రాముల పైనే తింటున్నారట. 8000మిల్లీగ్రాముల వరకు సోడియం అందేట్లు చేస్తున్నారట. అసలు కావాల్సినదానికంటే..ఎంత ఎక్కువో చూడండి.  కిడ్నీలు రోజుకు 4 గ్రాముల సాల్ట్ ను మాత్రమే విసర్జించపగలుగుతాయి. అంతకుమించి చేయలేవు. అలా మిగిలిన ఉప్పు అంతా పేరుకుపోయి రకరకాల రోగాలు వచ్చేట్లు చేస్తుంది.

 
కిడ్నీలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా పనిచేయాలంటే ఉడికిన ఆహారాన్ని మధ్యాహ్నం ఒక్కసారే తినండి. సాయంకాలం పూట, ఉదయం పూట వండకుండా తినేవి తినండి. వెజిటబుల్ జ్యూస్, మొలకెత్తిన విత్తనాలు, సాయంత్రం ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ తినండి. ఇలా చేయటం వల్ల సాల్ట్ వాడకం తగ్గిపోతుంది. నిల్వ పచ్చళ్లు వల్ల కిడ్నీలు బాగా డామేజ్ అవుతాయి. అవి కూడా వీలైనంత తక్కువ తినడం అలవాటు చేసుకోండి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.