ఈ 9 రకాల పప్పుల్లో నాన్‌వెజ్ కంటే.. ఎక్కువ బలం.. కండపుష్టి కావాలంటే ఇవి తినాల్సిందే !
మనం అతి బలుముగా, కండపుష్టితో ఉండాలన్నా, నీరసాన్ని తగ్గించుకోని..హుషారుగా పని చేయాలంటే.. అతిబలమైన ఆహారం కావాలి. ఇక బలం అంటే..అందరూ నాన్‌వెజ్ అనే అనుకుంటారు. కానీ 100 గ్రాముల చికెన్‌లో 109 కేలరీల శక్తి మాత్రమే ఉంటుంది. అదే 100 గ్రాముల మటన్‌లో 118 కేలరీల శక్తి మాత్రమే వస్తుంది. ఇక 100 గ్రాముల చేపలు తీసుకుంటే..80-90 కేలరీల శక్తి మాత్రమే వస్తుంది. వీటన్నింటికంటే..అతిబలాన్ని ఇచ్చే 9 రకాల పప్పులు ఉన్నాయి. ఈరోజు అవి ఏంటో చూద్దాం. ఎవరైతే బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారో, కండపుష్టి పెరగాలనుకుంటున్నారో మానకుండా వీటిని తింటే చాలు.
1. పచ్చికొబ్బరి
100గ్రాముల పచ్చికొబ్బరిలో 444 కేలరీల శక్తి వస్తుంది. ఇది తక్కువ ధరలో ఎక్కడైన లభిస్తుంది కాబట్టి రోజు ఒక చెక్క తిన్నా చాలు. దీంట్లో ముఖ్యంగా తెలివితేటలకు కావాల్సిన మంచి కొవ్వులు ఉంటాయి. పచ్చికొబ్బరి ఆరోగ్యంతో పాటు..మేధాశక్తికి కూడా మంచిది కాబట్టి కావల్సినవారు తప్పక తినండి.
2. వేరుశనగ పప్పులు
100 గ్రాముల వేరుశనగ పప్పులు తీసుకుంటే 567 కేలరీల శక్తి ఉంటుంది. నాన్‌వెజ్‌లో కూడా అంత ఉండదు. వాటితో పోలిస్తే..5రెట్లు బలం ఎక్కువ. తక్కువ రేటులో లభిస్తాయి.
3. పొద్దుతిరుగుడు పప్పు
100 గ్రాముల పొద్దుతిరుగుడు పప్పులో 570 కేలరీల శక్తి ఉంటుంది. దీని ధర కాస్త ఎక్కువ ఉంటుంది. కేజీ 300-350 వరకూ ఉంటుంది.
4. గుమ్మడిగింజల పప్పు
100 గ్రాముల గుమ్మడిగింజల పప్పు 590 కేలరీల శక్తిని అందిస్తుంది. గుమ్మడిగింజల్లో జింక్ బాగా ఉండటంతో..మేధాశక్తికి బాగా పనికొస్తుంది. చిన్నపిల్లల్లో గ్రాస్పింగ్ పెరగడానికి, తెలివితేటలు పెరగి..చదువుబాగా రావడానికి కూడా ఉపయోగపడతాయి. ఏకగ్రతకు కూడా ఈ గింజలు చాలా మంచివి.
5. పుచ్చగింజల పప్పు
100 గ్రాముల పుచ్చగింజల పప్పులో 626 కాలరీల శక్తి లభిస్తుంది. దీని ధర 250-300 వరకూ ఉంటుంది. మాంసకృతులు 34గ్రాములు ఉంటాయి. కోడిమాంసం, మేకమాంసంతో పోలిస్తే..హై. ప్రోటీన్ పుచ్చగింజల పప్పులో ఉంటుంది.
ఇప్పుడు చెప్పుకోబోయే నాలుగు రకాలు కాస్త ఖర్చు ఎక్కువైనవి..టేస్ట్ కూడా బాగుంటాయి..అవి కూడా ఏంటో తెలుసుకోవాలనుకుంటన్నారా..
6. జీడిపప్పు
100 గ్రాముల జీడిపప్పులో 596 కాలరీల శక్తి లభిస్తుంది. రుచిలో నెంబర్ వన్..కూరల్లో వేసిన సూపర్ ఉంటాయి.
8. బాదంపప్పు
100 గ్రాముల బాదంపప్పులో 655 కాలరీల శక్తి లబిస్తుంది. వీటి ధర కేజీ 1000-1200 వరకూ ఉంటుంది. ఆరోగ్యానికి ఇవి చాలామంచివి..జుట్టుకు కూడా చాలా మంచిది.
9. వాల్నట్స్
అన్నింటికంటే ఆఖరిదైన... వాలనట్స్ 100 గ్రాములు తీసుుకంటే.. 687కేలరీల శక్తి వస్తుంది. మేకమాంసం, కోడిమాంసంతో పోలీస్తే..6రెట్లు బలమైన ఆహారాలు ఇవన్నీ. చేపలతే పోలీస్తే..9-10రెట్లు బలమైన ఆహారాలు.
ఈ తొమ్మిది రకాల విత్తనాలు.. అతి బలమైన విత్తనాలు కాబట్టి..మీరు కొనగలగినవి అన్నీ కొనుక్కోని పచ్చికొబ్బరి తప్ప మిగతావి అన్నీ 6-8 గంటలపాటు.. నానపెట్టుకునే తినాలి. ఇని నానపెట్టుకుని తిన్నప్పుడే..తేలిగ్గా.
డైజెషన్ అవుతాయి, గ్యాస్ రాకుండా ఉంటుంది. ఒంటికి మొత్తం గ్రహించుకునే శక్తి వస్తుంది. రోజులో ఒక ఆహారంగా..అతి బలాన్ని ఇచ్చే పప్పులను తింటూ ఉండండి. ఒక్కోరకం..10-20 గ్రాములు చొప్పున నాలుగు రకాలు తినండి..ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లా వీటిని తింటే మంచిది.
ఇడ్లీ, దోశలను మానేసి వీటిని బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకుంటే..ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం నచ్చకపోతే..ఈవినింగ్ డిన్నర్ కింద తినొచ్చు. కండపుష్టిని, ధారుడ్యాన్ని కోరుకునేవారు.. జిమ్‌కు వెళ్లేవారు, బాడీబిల్డర్స్, వెయిట్ లిఫ్టర్స్, ఆటలు ఆడేవారు, బాగా బరువు పెరగాలనుకునే వారు..వీటిని కొనుక్కుని తినాలని ప్రముఖ ప్రకృతి వేద్య నిపుణులు సూచిస్తున్నారు.