కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాల్సిందే

మూత్రపిండాలు.. ఇవి శరీరంలో చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. కానీ పెద్ద పెద్ద పనులే చేస్తుంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీలు బాగుండాలి. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి. చాలా సున్నితమైన అవయవాలు కిడ్నీలు. వీటిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. మూత్ర‌పిండాల‌ను శుభ్రంగా ఉంచ‌డంలో నీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజుకు 3 నంచి 4 లీట‌ర్ల నీటిని తాగ‌డం

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాల్సిందే


మూత్రపిండాలు.. ఇవి శరీరంలో చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. కానీ పెద్ద పెద్ద పనులే చేస్తుంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీలు బాగుండాలి. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి. చాలా సున్నితమైన అవయవాలు కిడ్నీలు. వీటిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. మూత్ర‌పిండాల‌ను శుభ్రంగా ఉంచ‌డంలో నీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజుకు 3 నంచి 4 లీట‌ర్ల నీటిని తాగ‌డం మంచిది. నీరు ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉండే మ‌లినాలు మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. దీంతో మూత్ర‌పిండాలు ప‌రిశుభ్రంగా ఉంటాయి. కిడ్నీల ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.!

మూత్ర‌పిండాల‌ను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచ‌డంలో బార్లీ గింజ‌లు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. నీటిలో బార్లీ గింజ‌ల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఆ నీటిని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో పేరుకుపోయిన మ‌లినాలు తొల‌గిపోతాయి. అలాగే తాజా పండ్లు, పొటాషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మూత్ర‌పిండాల సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డ్డాము అని తెలుసుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే కొన్ని అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి. అలాగే మ‌న జీవ‌న శైలిలో కూడా మార్పు చేసుకోవాలి.  
ఉప్పును అధికంగా తీసుకోకూడ‌దు. ఉప్పు ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల‌పై ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డుతుంది. ఉప్పును త‌క్కువ‌గా తీసుకోవ‌డం వల్ల మూత్ర‌పిండాలకు సంబంధించిన వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. 
పెయిన్ కిల్ల‌ర్ ల‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. వీటిని ఎక్కువ‌గా వాడ‌డం వల్ల మూత్ర‌పిండాల‌పై చెడు ఫ్ర‌భావాన్ని చూపుతాయి. వీటికి సాధ్య‌మైనంత దూరంగా ఉండాలి. 
రోజూ నిద్ర పోవ‌డం కూడా చాలా అవ‌స‌రం. నిద్ర‌లేమి వ‌ల్ల కూడా మూత్ర‌పిండాల‌కు సంబంధించిన వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశం ఉంది.
మూత్రం వ‌చ్చిన‌ప్ప‌టికి విస‌ర్జించ‌కుండా అలాగే ఉంటారు. దీని వ‌ల్ల మూత్ర‌పిండాల‌పై ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది.
మ‌ద్య‌పానం,ధూమ‌పానం వంటి వాటికి దూరంగా ఉండాలి. 
టీ, కాఫీలను కూడా ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. రోజూ త‌గినంత వ్యాయామం చేస్తూ ఉండాలి. 
అధిక బ‌రువు బారిన ప‌డ‌కుండా ఉండాలి. 
చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకుంటూ చ‌క్క‌టి జీవ‌న శైలిని పాటించ‌డం వ‌ల్ల మ‌నం మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.