Health : నైట్‌ నిద్రరావడం లేదా..? ఈ చిన్న పని చేయండి..!

Health : మన ఆరోగ్యానికి తిండి ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం..కానీ అదేంటో.. ఇవి టైమ్‌ ప్రకారం మాత్రమే చేయాలి.. ఎప్పుడుపడితే అప్పుడు తిన్నా, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయినా డేంజరే

Health : నైట్‌ నిద్రరావడం లేదా..? ఈ చిన్న పని చేయండి..!


Health : మన ఆరోగ్యానికి తిండి ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం..కానీ అదేంటో.. ఇవి టైమ్‌ ప్రకారం మాత్రమే చేయాలి.. ఎప్పుడుపడితే అప్పుడు తిన్నా, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయినా డేంజరే..రాత్రి నిద్ర పట్టక మీరు కూడా ఇబ్బంది పడుతుంటే ఈ చిన్నా చిట్కాను ట్రై చేయండి.. దీనివల్ల త్వరగా నిద్రపోతారు..  

హాయిగా నిద్రించడానికి ప్రకృతి అందించిన మూడు పదార్థాల వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అవే కొబ్బరి నూనె, ఉప్పు, సహజ తేనె (అటవీ తేనె). ఈ మూడు పదార్థాల కలయిక నిద్రకు సహాయపడుతుంది. మానసికంగా, శారీరకంగా అలసిపోయిన వారికి చాలా విశ్రాంతిని అందిస్తుంది. ఈ మూడింటిని ఎలా ఉపయోగించాలంటే..
రెండు టీస్పూన్లు కొబ్బరి నూనె, ఒక టీస్పూన్ కల్లుప్పు , అర టీస్పూన్ అడవి తేనె (ప్రాసెస్ చేసిన తేనె అంతగా ఉపయోగపడదు) తీసుకోవాలి.
ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేసి మిశ్రమంలా చేయండి. నిద్రకు ఉపక్రమించే ముందు నేరుగా ఈ మిశ్రమాన్ని పెద్ద చెంచా అంతా తీసుకోండి. తర్వాత ఒక పెద్ద గ్లాసు నీరు తాగాలి. దాదాపు ఐదు నుంచి ఆరు నిమిషాలు నడవండి. ఈ మిశ్రమాన్ని ప్రతిసారీ తాజాగా తయారుచేయాలి. ముందు రోజు తయారుచేసిన మిశ్రమాన్ని వాడకండి.. చాలా మంది అనుకుంటారు.. నైట్‌ నిద్రపోయే ముందు వాటర్‌ తాగకూడదు అని. కానీ మీరే ఆలోచించండి.. ఒక ఏడు ఎనిమిది గంటలు బాడీకి వాటర్‌ లేకుండా ఉంటుంది.. మీరు ఎప్పుడో తాగుతారు.. దీనివల్ల లోపల సిస్టమ్‌ ఎలా పనిచేస్తుంది. నైట్‌ నిద్రపోయే ముందు వాటర్‌ తాగొచ్చు.. మహా అయితే ఒకసారి టాయిలెట్‌కు వెళ్తారు.. బాడీకి నీళ్లే మనం ఇచ్చే ఎనర్జీ.! అలా అని లీటర్లు లీటర్లు తాగక్కర్లేదు.. రాత్రి ఒక గ్లాస్‌ వాటర్‌ తాగి పడుకుంటే సరి..!
ఈ మిశ్రమాన్ని మొదటి రోజున చిన్న చెంచా మాత్రమే తీసుకోండి. మీకు మరేదైనా సమస్య ఉంటే, తీసుకుంటున్న మందులతో ఈ మూడు పదార్థాలు అలెర్జీ కారణమైతే మీ ఆరోగ్యం పాడైపోవచ్చు. మీకు మెడిసిన్ ఇచ్చే వైద్యుని సలహా తీసుకున్న తర్వాత కొనసాగించడం ఉత్తమం. అలెర్జీ లేదా సైడ్ ఎఫెక్ట్ లేనట్లయితే ఇది వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది.
ఈ చిట్కాతో పాటుగా రాత్రిపూట తినే ఆహారం కూడా నిద్ర మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని ఆహారాలు తింటే.. మీకు పీడకలలు కూడా వస్తాయి తెలుసా..? రాత్రిపూట పేదవాడిలా భోజనం చేయాలని మన పెద్దోళ్లు చెప్తుంటారు.. దీని ఉద్దేశం రాత్రికి చాలా తక్కువ తినాలని. అదే సమయంలో సరైన ఆహారాలు తీసుకోవడం కూడా ముఖ్యమే. చక్కెర, ఉప్పగా ఉండే ఆహారాలు రాత్రిపూట మీ నిద్రను ప్రభావితం చేస్తాయి. విటమిన్ B6, ట్రిప్టోఫాన్, లీన్ ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లతో నిండిన తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.