Bed Vs washroom : బాత్రూం కంటే బెడ్ మీదే ఎక్కువ క్రిములు ఉంటాయని నమ్మరా.. ఇదే నిజం.. 

Germs on bed : ఇంట్లో క్రిములు ఎక్కువగా ఉండే ప్రదేశం ఏది అంటే bathroom అని వెంటనే చెబుతాం..  అయితే నిజానికి bathroom కంటే రోజు పడుకునే bed పైనే ఎక్కువ grems ఉంటాయని తాజా అధ్యయనాల్లో తేలింది.. 

Bed Vs washroom : బాత్రూం కంటే బెడ్ మీదే ఎక్కువ క్రిములు ఉంటాయని నమ్మరా.. ఇదే నిజం.. 
More germs in your bed than in the bathroom


Germs on bed : ఇంట్లో క్రిములు ఎక్కువగా ఉండే ప్రదేశం ఏది అంటే bathroom అని వెంటనే చెబుతాం..  అయితే నిజానికి bathroom కంటే రోజు పడుకునే bed పైనే ఎక్కువ grems ఉంటాయని తాజా అధ్యయనాల్లో తేలింది.. 

పరిశుభ్రత చాలా ముఖ్యమైన అంశం.. దీని విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించిన పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.. ముఖ్యంగా బెడ్ రూమ్ విషయంలో ఈ జాగ్రత్త మరింత అవసరం.. నిత్యం పడుకొనే బెడ్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. ఎప్పటికప్పుడు బెడ్ షీట్లను మారుస్తూ ఉండటం వల్ల బ్యాక్టీరియా అభివృద్ధి చెందదని తెలుస్తోంది..

చాలామంది బెడ్ షీట్లు ఒకసారి మార్చిన తర్వాత మళ్ళీ పూర్తిగా కనిపించేంతవరకు అలానే వదిలేస్తారు. కానీ ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు. వారానికి ఒక్కసారి అయినా బెడ్ షీట్లను తీసి ఉతుకుతూ ఉండాలి లేదు అంటే హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతూనే ఉంటుంది.. నిత్యం మనం పడుకునే మంచం మీద మన శరీరం నుండి ఎన్నో విడుదలవుతూ ఉంటాయి. ఇవన్నీ మనకి కనిపించవు తల పైన చుండ్రు శరీరం  నుండి చెమట లాలాజలం వంటివి విడుదలయ్యి వాటికి సంబంధించిన బ్యాక్టీరియా బైట్ సీట్ల పైన నిల్వ ఉండిపోతుంది..

అలాగే వీటిని అలాగే వదిలేస్తే పలు రకాల చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అలాగే జలుబు నిమోనియా వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా దిండ్లలో ఎక్కువగా బ్యాక్టీరియా పేరుకుపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వీటిని మార్చడం కానీ లేదా ఎండలో వేయటం కానీ చేయాలి. ఇలా చేయకపోతే జుట్టు ఊడిపోవడం మొహం పై మొటిమలు ఏర్పడటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారి ఇంట్లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఎందుకంటే వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది ఎలాంటి అనారోగ్యాలకైనా వెంటనే ప్రభావితం అవుతారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.