Health : టాయిలెట్‌ బాగా వస్తుందా..? అతి మూత్రం సమస్యను ఇలా నయం చేసుకోండి..!

Health : మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అతిమూత్రంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. షుగర్‌ వల్ల ఇలా జరగుతుంది. కానీ కొంతమందికి షుగర్‌ లేకున్నా

Health : టాయిలెట్‌ బాగా వస్తుందా..? అతి మూత్రం సమస్యను ఇలా నయం చేసుకోండి..!


Health : మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అతిమూత్రంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. షుగర్‌ వల్ల ఇలా జరగుతుంది. కానీ కొంతమందికి షుగర్‌ లేకున్నా.. అతిమూత్రంలో ఇబ్బంది పడతారు. ఇలా ప్రతిసారి టాయిలెట్‌కు వెళ్లడం వల్ల.. నీరసం అయిపోతారు. ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం యూరిన‌రీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ (యూటీఐ) అని వైద్య‌ నిపుణులు చెబుతున్నారు. సాధార‌ణంగా ఒక ఆరోగ్య‌వంతుడైన మ‌నిషి రోజులో 5 నుంచి 6 సార్లు మాత్ర‌మే మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. అంత‌కంటే రెట్టింపు మూత్ర విస‌ర్జ‌న చేసినా అలాగే మూత్ర విస‌ర్జ‌న స‌మ‌యంలో నొప్పి, మంట వంటి భావ‌న క‌లిగిన కూడా మూత్రాశ‌య ఇన్ ఫెక్ష‌న్ బారిన పడ్డారని అర్థం. ఈ సమస్యను కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగించి..నయం చేసుకోవచ్చు.. 

అతిమూత్ర వ్యాధితో బాధ‌ప‌డే వారు ముందుగా ఒక గ్లాస్ నీటిలో అర‌ టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి క‌లిపి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్‌కు కార‌ణ‌మ‌య్యే బాక్టీరియా వ్యాప్తి త‌గ్గి ఇన్‌ఫెక్ష‌న్ త‌గ్గుతుంది.. ఇలా రోజుకు రెండు నుండి మూడు సార్లు బేకింగ్ సోడాను క‌లిపిన నీటిని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ చిట్కాను పాటించ‌డంతో పాటు ప్ర‌తిరోజూ ఉద‌యం 7 లేదా 8 తుల‌సి ఆకుల‌ను న‌మిలి తిని ఆ త‌రువాత ఒక టీ స్పూన్ తేనెను కూడా తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ స‌మ‌యంలోనే అతి మూత్ర వ్యాధి త‌గ్గుతుంది. 
ఈ చిట్కాను పాటించడం వల్ల.. మూత్రాశ‌యంలో మంట‌, నొప్పి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి. అలాగే భ‌విష్య‌త్తులో ఈ స‌మ‌స్య రాకుండా ఉండాలంటే నీటిని ఎక్కువ‌గా తాగ‌డం, ఇంట్లో లేదా బ‌య‌ట టాయిలెట్స్‌ను ఉప‌యోగించేట‌ప్పుడు స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవడం వంటివి చేయ‌డం వ‌ల్ల మూత్రాశ‌య ఇన్ ఫెక్ష‌న్‌ల బారిన ప‌డ‌కుండా ఉండొచ్చు. సమస్య ఉండే పైన చెప్పిన చిట్కాలను ట్రై చేసి చూడండి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.