కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే.. మీకు కూడా వస్తాయా..?

జబ్బులు రావడానికి మన జీవనశైలి ఒక కారణం అయితే.. వంశపారపర్యంగా వచ్చే జబ్బులు కూడా ఒక కారణం. అలాంటివాటిల్లో గుండె జబ్బులు కూడా ఒకటి. వంశ‌పార‌ప‌ర్యంగా వ‌చ్చి ప్రాణాంతకంగా మారే జ‌బ్బుల్లో గుండె జ‌బ్బులు

కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే.. మీకు కూడా వస్తాయా..?


జబ్బులు రావడానికి మన జీవనశైలి ఒక కారణం అయితే.. వంశపారపర్యంగా వచ్చే జబ్బులు కూడా ఒక కారణం. అలాంటివాటిల్లో గుండె జబ్బులు కూడా ఒకటి. వంశ‌పార‌ప‌ర్యంగా వ‌చ్చి ప్రాణాంతకంగా మారే జ‌బ్బుల్లో గుండె జ‌బ్బులు ముందు ఉంటుంది. మ‌న పూర్వీకుల‌కు గుండె జ‌బ్బులు, అధిక ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌లు ఉంటే అవి మ‌న‌కు కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే కొంద‌రిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటాయి. ఎన్ని ర‌కాల మందులు వాడిన‌ప్ప‌టికి కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజ‌రాయిడ్ స్థాయిలు అధికంగానే ఉంటాయి.

Heart Attack: Many people have heart problems due to Damage To Cartilage  And Bones Surgeries | Heart Attack: చాలా మందికి ఈ శస్త్రచికిత్సల వల్లే గుండె  పోటు సమస్యలు వస్తున్నాయి News in Telugu

ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌ట్టు ప‌రీక్ష‌లు చేయించుకుంటే కానీ తెలియ‌దు. ఇటువంటి స‌మ‌స్య‌ల‌కు పూర్వీకులు మందులు వాడితే మీరు కూడా వెంటనే ప‌రీక్ష‌లు చేయించుకుని మందులు వాడ‌డం మంచిది. ఎన్ని ర‌కాల ఆహార నియ‌మాలు పాటించిన‌ప్ప‌టికి ఇటువంటి స‌మ‌స్య‌లు వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తే ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఎక్కువ‌గానే ఉంటుంది. ముందు నుంచి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం. 

పూర్వీకుల్లో ర‌క్త‌పోటు బారిన ప‌డిన వారు దానికి మందులు వాడిన వారు ఉంటారు. అలాంటి వారు కూడా ముందు నుంచి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. ర‌క్త‌పోటు స‌మ‌స్య ఉంటే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి కదా అనుకోవచ్చు.. ఈ ల‌క్ష‌ణాలు ఒక్కోసారి క‌నిపించ‌వు. దాని వ‌ల్ల క‌లిగే ఇబ్బందులు కూడా మ‌న‌కు ఒక్కోసారి తెలియ‌వు. అలాంటి వారు కూడా జాగ్ర‌త్త‌ప‌డ‌కపోతే గుండె జ‌బ్బులు, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌లు, ర‌క్త‌నాళాలు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వంశ‌పార‌ప‌ర్యంగా ఇటువంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న వారు ముందు నుంచే మంచి జీవన విధానం పాటించాలి.
ఉద‌యం పూట వెజిటేబుల్ స‌లాడ్ కొద్దిగా, రెండు ర‌కాల మొల‌కెత్తిన గింజ‌ల‌ను, పండ్ల‌ను తీసుకోవాలి. 
ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. 
అలాగే మ‌ధ్యాహ్నం పూట అన్నానికి బ‌దులుగా జొన్న రొట్టె, రాగి రొట్టె, పుల్కా వంటి వాటిని తీసుకోవాలి. 
త‌క్కువ నూనె, త‌క్కువ ఉప్పుతో త‌యారు చేసిన కూరల‌ను తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బీపీ, కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

రాత్రి పూట నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్‌ను, వేయించిన అవిసె గింజ‌ల‌ను, పండ్ల‌ను తీసుకోవాలి. 

ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో గుండె జ‌బ్బులు, ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు, అధిక ర‌క్త‌పోటు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజ‌రాయిడ్ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. మీ కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు, ఊబకాయం ఉంటే.. మీరు మంచి లైఫ్‌స్టైల్‌ను పాటించడం చాలా అవసరం. లేదంటే.. మీరు కూడా ఆ జబ్బుల భారిన పడాల్సి వస్తుంది. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.