గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ 10 అలవాట్లు మీలో ఉన్నాయా!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు గుండెపోటు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు సైతం గుండెపోటుతో మరణించడం బాధ కలిగించే విషయమే. ముఖ్యంగా గడిచిన నాలుగేళ్లలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ 10 అలవాట్లు మీలో ఉన్నాయా!


ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు గుండెపోటు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు సైతం గుండెపోటుతో మరణించడం బాధ కలిగించే విషయమే. ముఖ్యంగా గడిచిన నాలుగేళ్లలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య ఎక్కువేనని చెప్పాలి.

కేవలం 40 ఏళ్లు కూడా దాటకుండానే గుండెపోటుతో మరణించడం బాధ కలిగించే విషయమే. ముఖ్యంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ రోజు వ్యాయామం చేస్తున్న వారిని సైతం ఈ గుండెపోటు సమస్య వేధిస్తూనే వస్తుంది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్, మిస్ యూనివర్స్ సుస్మితసేన్ వరకు ప్రతి ఒక్కరిని గుండెపోటు సమస్య వేధిస్తూనే వస్తుంది. అయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కచ్చితంగా కొన్ని అలవాట్లు మానేయాలని తెలుస్తోంది.

1. షుగర్ వ్యాధి ఉండటం.. సాధారణంగా మధుమేహం సమస్య ఉన్నవారికి గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో గుండెపోటు వచ్చే అవకాశం 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అందుకే షుగర్ వ్యాధి ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి

2. రక్తపోటు.. హైబీపీ ఉన్నవాళ్లు సైతం గుండెజబ్బులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగిపోయే సమయంలో గుండపైన భారంపడే అవకాశం ఉందని అందుకే రక్తపోటు సమస్య ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలుస్తోంది.

3. కొలెస్ట్రాల్ పెరిగిపోవడం.. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కూడా గుండె పైన భారం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మాంసాహారం, బయట చిరుతిళ్లు, వేపుడు పదార్థాలు వంటి వాటిని మానుకోవాలి. శరీరంలో అధికంగా కొవ్వు పేరుకోకుండా రోజు వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి.

4. పొట్ట పెరగటం.. లావు పెరగడానికి పొట్ట పెరగడానికి తేడా ఉందని కచ్చితంగా గమనించాలి. ఈ పెరిగే లావు శరీరానికి భారం కాకుండా చూసుకోవాలి. జీర్ణాశయం చుట్టూ పొట్ట లోపల భాగంలో కొవ్వు పేరుకు పోవడం వల్ల గుండె జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఆడవారిలో 35 అంగుళాలు మగవారిలో 40 అంగుళాల కన్నా పొట్ట ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి.

5. ఒత్తిడి..  సాధారణంగా ఒత్తిడి మానసిక సమస్య అనే చెప్పాలి. రోజు సరైన పని లేకపోవడం, మనసుకి తగిన. వ్యాయామం లేకపోవడం వల్ల ఒత్తిడి సమస్య వేధిస్తుంది అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులు కుటుంబ బాధ్యతలు ఆడవారిలో మోనోపాజ్ వంటివన్నీ ఒత్తిడిని గురి చేసే లక్షణాలే ఇవన్నీ గుండె పనితీరుని బలహీన పరుస్తాయని గుర్తించుకోవాలి.

6. వ్యాయామం లేకపోవడం..  ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి వ్యాయామం చేయడానికి తగిన సమయం ఉండటం లేదు. దీనివలన తినటం కేవలం పని చేసుకోవడం వల్ల శరీరానికి వ్యాయామం లేక గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.

7. ఆల్కహాల్ తీసుకోవడం..  ఆల్కహాల్ తాగడం వల్ల ట్రై గ్లిజరైడ్స్ రక్తంలో పెరుగుతాయి. వీటివల్లనే హైబీపీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందువలన మద్యం అతిగా సేవించడం సరైన పద్ధతి కాదు.

8. పొగ తాగటం.. పొగ తాగే వారిలో మామూలు వాళ్లతో పోలిస్తే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉండే దెబ్బలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  పొగాకులో ఉండే కార్బన్ మోనాక్సైడ్ నికోటిన్ వంటివి శరీరానికి ఎంతో హాని చేస్తాయి.

9. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం.. సాధారణంగా ఈ రోజుల్లో ఆకుకూరలు, కాయగూరలు కన్నా మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. అందులో నిల్వ ఉంచిన మాంసాహారం బయట దొరికే ప్రాసెస్డ్ మాంసం తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

10. ఆడవారు గర్భనిరోధక మాత్రలు వాడటం..  సాధారణంగా ఈ రోజుల్లో అప్పుడే పిల్లలు వద్దనుకోవడం పిల్లల్ని పోస్ట్ ఫోన్ చేసుకోవడం వంటి వాటితో గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. వీటి వల్ల కూడా గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.