Beauty : క్యారెట్‌తో ఇలా చేస్తే మీ జుట్టు అస్సలు ఊడదు..!

Beauty : ఈరోజుల్లో చాలా మందికి జుట్టు సమస్య ఉంటుంది. ఆడ, మగ అని తేడా లేకుండా అందరూ రాలే జుట్టును పరేషాన్‌ అవుతున్నారు. అసలు తలలో దువ్వెన పెట్టాలంటేనే భయమైతుంది. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి.

Beauty : క్యారెట్‌తో ఇలా చేస్తే మీ జుట్టు అస్సలు ఊడదు..!


Beauty : ఈరోజుల్లో చాలా మందికి జుట్టు సమస్య ఉంటుంది. ఆడ, మగ అని తేడా లేకుండా అందరూ రాలే జుట్టును పరేషాన్‌ అవుతున్నారు. అసలు తలలో దువ్వెన పెట్టాలంటేనే భయమైతుంది. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి.. కారణాలు ఏమైనా కానీ.. మీరు ఈ ఒక్క పని చేశారంటే.. మళ్లీ జుట్టు రాలదు.. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మ‌నం జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

జుట్టును ఒత్తుగా మార్చే ఇంటి చిట్కా

ఈ చిట్కాను త‌యారు చేయ‌డానికి మ‌నం క్యారెట్‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక పెద్ద క్యారెట్‌ను తీసుకుని ముక్క‌లుగా చేయాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను నీటిలో వేసి మెత్త‌గా ఉడికించాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను జార్‌లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్‌కు త‌గినంత కొబ్బ‌రినూనె లేదా బాదం నూనె, ఆలివ్ నూనె, ఆవ నూనె ఇలా మ‌న‌కు న‌చ్చిన నూనెను క‌లిపి జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు బాగా ప‌ట్టించాలి. ఇలా ప‌ట్టించిన గంట త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు ధృడంగా మార‌తాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. 
క్యారెట్‌లో ఉండే విట‌మిన్ ఏ, కెర‌ట‌నాయిడ్లు మీ జుట్టును ఆరోగ్యంగా మెరిసేలాగా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల త‌ల‌లో ఉండే చుండ్రు వంటి వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్‌లు కూడా త‌గ్గుతాయి. అంతేకాకుండా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల పొడి బారిన జుట్టు కూడా నిగారింపును సొంతం చేసుకుంటుంది. 
జుట్టు చిట్ల‌డం, జుట్టు తెగ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే మ‌నం తినే ఆహారంలో పోష‌కాలు ఉండేలా చూసుకోవాలి. రసాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. జుట్టు రాల‌డం, జుట్టు పొడిబార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.