Beauty : ముఖానికి ఈ బేసిక్‌ చిట్కాలు పాటిస్తే.. మొటిమలు, మచ్చలు మాయం..!!

Beauty : అందంగా ఉండటం అనేది ఈరోజుల్లో చాలామందికి అవసరం అయిపోయింది. నిజానికి మన అప్పీరియన్స్‌ బాగుంటే.. తెలియకుండానే మనకు ధైర్యం వచ్చేస్తుంది. నులుగురిలో మాట్లాడగలికే భావన కలుగుతుంది.

Beauty : ముఖానికి ఈ బేసిక్‌ చిట్కాలు పాటిస్తే.. మొటిమలు, మచ్చలు మాయం..!!


Beauty : అందంగా ఉండటం అనేది ఈరోజుల్లో చాలామందికి అవసరం అయిపోయింది. నిజానికి మన అప్పీరియన్స్‌ బాగుంటే.. తెలియకుండానే మనకు ధైర్యం వచ్చేస్తుంది. నులుగురిలో మాట్లాడగలికే భావన కలుగుతుంది. మీ ముఖం మీకే నచ్చకుంటే.. మీరు పదిమందిలోకి వెళ్లినప్పుడు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్‌ అవుతారు. అందుకేనేమో అందరూ అందంగా ఉండేందుకు తమ సంపాదనలో ఎంతోకొంత ఖర్చుచేస్తారు. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి ముఖాన్ని, అందంగా, కాంతివంతంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ముఖాన్ని అందంగా మార్చే ఇంటి చిట్కాలు ఏంటి..? వీటిని ఎలా వాడాలో చూద్దామా..!

ముఖం కాంతివంతంగా ఉండాల‌ని కోరుకునే వారు ప‌సుపును, గంధాన్ని స‌మ‌పాళ్లలో తీసుకుని కొద్దిగా నీటిని క‌లిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని ఆరిన త‌రువాత చ‌ల్ల‌టి నీటితో క‌డుక్కోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం నిగారింపును సొంతం చేసుకుంటుంది. 
మ‌నం ఆహారంగా తీసుకునే పెరుగు సౌంద‌ర్య సాధ‌నంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.. చాలామంది బ్యూటీ టిప్స్‌లో పెరుగును వాడతారు.. ఈ పెరుగును రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకుని అందులో నాలుగు చుక్క‌ల వెనిగ‌ర్‌ను క‌లిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల త‌రువాత క‌డిగేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది.
రెండు టీ స్పూన్ల క‌ల‌బంద గుజ్జులో ఒక టీ స్పూన్ కీర‌దోస గుజ్జును, చిటికెడు ప‌సుపు, నిమ్మ ర‌సాన్ని క‌లిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల త‌రువాత క‌డిగేయ‌డం వల్ల ముఖంపై వ‌చ్చే మొటిమలు, మ‌చ్చ‌లు త‌గ్గి ముఖం అందంగా తయారవుతుంది..
పాల మీగ‌డ‌లో తేనెను వేసి బాగా క‌లిపి ముఖానికి రాసుకుని 30 నిమిషాల త‌రువాత క‌డిగేయ‌డం వ‌ల్ల ముఖం మెరుస్తూ క‌న‌బ‌డుతుంది. 
రెండు టీ స్పూన్ల పంచ‌దార‌లో ఆలివ్ నూనెను, నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అర‌గంట త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉప‌యోగించే పంచ‌దార స్క్ర‌బ‌ర్ లా ప‌నిచేసి ముఖంపై ఉండే మృత‌క‌ణాల‌ను తొల‌గిస్తుంది. దీంతో ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది.
ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల ముఖం అందంగా, ఎలాంటి మొటిమలు, మచ్చలు, ముడతలు లేకుండా అవుతుంది. అంతే.. మీకు మీరే బాగా నచ్చేస్తారు. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.