Acne Causes : ముఖంపై ఎన్ని మచ్చలు, మొటిమలు ఉన్నా.. ఇలా చేస్తే అన్నీ మాయం..!

Acne Causes : అసలే ఇది ఎండాకాలం... బయటకు వెళ్తే.. ఈజీగా అలిసిపోతాం.. ముఖం కూడా టాన్‌ అయిపోతుంది. ఇంట్లో ఉంటేనే అంతంత మాత్రంగా ఉంటుంది.. ఇక బయటకు వెళ్తే ఏమైనా ఉందా..?

Acne Causes : ముఖంపై ఎన్ని మచ్చలు, మొటిమలు ఉన్నా.. ఇలా చేస్తే అన్నీ మాయం..!


Acne Causes : అసలే ఇది ఎండాకాలం... బయటకు వెళ్తే.. ఈజీగా అలిసిపోతాం.. ముఖం కూడా టాన్‌ అయిపోతుంది. ఇంట్లో ఉంటేనే అంతంత మాత్రంగా ఉంటుంది.. ఇక బయటకు వెళ్తే ఏమైనా ఉందా..? న‌ల్ల మ‌చ్చ‌లు, పిగ్మేంటేష‌న్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి వచ్చేస్తాయి.. ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి ఎన్నో ర‌కాల సౌందర్య‌ సాధ‌నాల‌ను వాడుతూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తుంటారు. ఇలా బ‌య‌ట దొరికే వాటిని వాడ‌డానికి బ‌దులుగా ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా మ‌నం ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో చంద‌నం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. చంద‌నం చ‌ర్మాన్ని అందంగా, శుభ్రంగా ఉంచుతుంది. చ‌ర్మానికి టోన‌ర్‌లా కూడా వాడుకోవచ్చు.. చంద‌నాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. అలాగే నిమ్మ‌ర‌సం చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఇందులో ఉన్న సిట్రిక్ యాసిడ్ బ్లాక్ హెడ్స్‌ను, వైట్ హెడ్స్‌ను తొల‌గిస్తుంది.. రోజ్ వాట‌ర్‌ను ఉప‌యోగించి కూడా మ‌నం చ‌ర్మాన్ని అందంగా ఉంచుకోవ‌చ్చు.
ఒక గిన్నెలో చందనాన్ని, నిమ్మ‌ర‌సాన్ని, రోజ్ వాట‌ర్‌ను వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని ఆరిన త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఈ చిట్కాను త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. 
బార్లీ గింజ‌ల పొడి, తుల‌సి ఆకుల పేస్ట్, రోజ్ వాట‌ర్‌ను ఒక గిన్నెలో వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని కూడా ముఖానికి రాసుకుని ఆరిన త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఇది చ‌ర్మానికి మంచి స్క్ర‌బ‌ర్‌లా ప‌ని చేస్తుంది. 
చ‌ర్మాన్ని అందంగా ఉంచ‌డంలో బొప్పాయి పండ్ల గుజ్జు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక గిన్నెలో బొప్పాయి పండ్ల గుజ్జును, ముల్తానీ మ‌ట్టిని, ప‌సుపును వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్ర‌మం బాగా ఆరిన త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఈ విధంగా క్ర‌మం త‌ప్ప‌కుండా వారానికి మూడుసార్లు చేయ‌డం వ‌ల్ల పిగ్మెంటేష‌న్‌ను నివారించుకోవ‌చ్చు. 
 
ఒక గిన్నెలో క‌ర్పూరం పొడిని, ముల్తానీ మ‌ట్టిని, నిమ్మ‌ర‌సాన్ని వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా పిగ్మేంటేష‌న్‌ను నివారించుకోవ‌చ్చు.
కొబ్బ‌రి నూనెలో క‌ర్పూరం పొడిని వేసి క‌లిపి న‌ల్ల మ‌చ్చ‌లు, పిగ్మెంటేష‌న్ ఉన్న చోట ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ కూడా చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. 
వీటిలో ఏదైనా సరే..తరచూ చేయండి.. ఫేస్‌ను అందంగా మార్చుకోండి..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.