Hair growth : జుట్టు వేగంగా పెరగాలంటే.. ఈ డైట్‌ పాటిస్తే చాలు..!

మీకు కూడా Hair problems ఉన్నాయా..?Hair fall కి ప్రధాన కారణం ఖనిజాల‌ను కోల్పోవడం. ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి త‌దిత‌ర పోష‌కాల లోపం వ‌ల్ల జుట్టు బాగా రాలుతుంది. క‌నుక వీటిని మ‌న‌కు అందేలా చూసుకోవాలి.

Hair growth : జుట్టు వేగంగా పెరగాలంటే.. ఈ డైట్‌ పాటిస్తే చాలు..!
Diet for hair growth


మీకు కూడా Hair problems ఉన్నాయా..? ఏం చేసినా లాభం లేదా..? అసలు సమస్య ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదా.? మీ ఈ సమస్యలన్నింటికి సింగిల్‌ సొల్యూషన్‌ ఈ ఆర్టికల్‌.. పోష‌కాహార లోపం వ‌ల్ల కూడా జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అందువ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను రోజు తీసుకోవాలి. శిరోజాలు దృఢంగా మారుతాయి. జుట్టు బాగా పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దామా..!

Hair fall కి ప్రధాన కారణం ఖనిజాల‌ను కోల్పోవడం. ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి త‌దిత‌ర పోష‌కాల లోపం వ‌ల్ల జుట్టు బాగా రాలుతుంది. క‌నుక వీటిని మ‌న‌కు అందేలా చూసుకోవాలి. అందుకు గాను పాల‌కూర‌ను బాగా తీసుకోవాలి. పాల‌కూర‌లో ఉండే పోష‌కాలు జుట్టు పెరుగుద‌ల‌కు స‌హాయ ప‌డ‌తాయి. పాల‌కూర జుట్టుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన కండిష‌నింగ్‌ను అందిస్తుంది. పాల‌కూర‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఆహారంలో రోజూ న‌ట్స్ ఉండేలా చూసుకోవాలి. బాదంపప్పు, పిస్తాప‌ప్పు వంటివి న‌ట్స్ కిందకు వ‌స్తాయి. వీటిల్లో విట‌మిన్ ఇ, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుద‌ల‌ను ప్రోత్స‌హిస్తాయి.. దాల్చిన చెక్క‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల కూడా జుట్టు స‌మ‌స్య‌లు ఉండ‌వు. జుట్టు బాగా పెరుగుతుంది.

సోయాబీన్‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. ఇది మ‌హిళ‌ల‌కు ఎన్నో సమస్యలకు ప్రభావంతంగా పనిచేస్తుంది. జీవ‌క్రియ‌లు మెరుగు ప‌డ‌తాయి. గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. శిరోజాలు దృఢంగా పెరుగుతాయి.

కోడిగుడ్ల‌లో బ‌యోటిన్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుద‌ల‌కు స‌హాయ ప‌డుతుంది. గుడ్ల‌లో ఉండే ప్రోటీన్లు, జింక్‌, సెలీనియం జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువ‌ల్ల గుడ్ల‌ను నిత్యం తీసుకోవాలి.

చేప‌ల‌లో ఒమెగా 3, ఒమెగా 6 త‌దిత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, విట‌మిన్ డి, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చూస్తాయి. శిరోజాల‌కు కాంతిని అందిస్తాయి. జుట్టు పెరుగుద‌ల‌ను ప్రోత్స‌హిస్తాయి. చేప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో తీసుకోవాలి.

డైట్‌ ఒక్క నెల రోజులు క్రమం తప్పకుండా ఫాలో అయ్యారంటే.. రిజల్ట్‌ పక్కా ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.