చర్మం అందంగా మెరిసిపోవాలా.. రోజు ఈ పండ్లు తింటే సరి!

వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. దీంతో చర్మం నల్లగా మారిపోతుంది. బయట తిరిగి రాగానే కాలుష్యం, పొగ వంటి వాటితో ఎలాంటి వారి చర్మమైన నిర్జీవంగా మారుతుంది. ముఖ్యంగా సున్నిత చర్మ తత్వం

చర్మం అందంగా మెరిసిపోవాలా.. రోజు ఈ పండ్లు తింటే సరి!


వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. దీంతో చర్మం నల్లగా మారిపోతుంది. బయట తిరిగి రాగానే కాలుష్యం, పొగ వంటి వాటితో ఎలాంటి వారి చర్మమైన నిర్జీవంగా మారుతుంది. ముఖ్యంగా సున్నిత చర్మ తత్వం ఉన్నవారికి మొహం కందిపోయి మచ్చలు మొటిమలు ఏర్పడతాయి. వీటన్నిటి నుండి దూరంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించడంతో పాటు పండ్లను అధికంగా తీసుకోవాలని తెలుస్తుంది. 

వేసవిలో ఎక్కువగా పండ్లు దొరుకుతూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుందని తెలుస్తోంది. అవి ఏంటంటే..

ద్రాక్ష:  వేసవికాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో ద్రాక్ష కూడా ఒకటి. ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మెరిపిస్తాయి. ముఖ్యంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో నల్ల ద్రాక్ష ముందుంటుందని తెలుస్తోంది. వీటిని రోజు తీసుకోవడం వల్ల చర్మం శుభ్రపడి మొహం కాంతివంతంగా మారుతుంది.

ఉసిరి : ఉసిరిని ఏ రకంగా తీసుకున్న చర్మానికి మంచిదే. రోజు ఒక ఉసిరిని తినడం వల్ల చర్మంపై పేర్కొన్న నిర్జీవ కణాలు అన్ని పోయి నూతన చర్మం వస్తుంది. అలాగే విటమిన్ సి చర్మాన్ని మెరిపిస్తుంది.

దానిమ్మ :  ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తం స్థాయిలు తక్కువగా ఉన్నవారు రక్తహీనతతో బాధపడేవారు సైతం ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా ఇవి చర్మానికి మొహానికి నిగారింపు ఇవ్వడంలో ముందుంటాయి.

కివి : ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. పుల్లగా ఉన్నప్పటికీ వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలను చర్మం పై వచ్చే మచ్చలు మడతలను తగ్గించడం ముందుంటాయి. 

అరటిపండు : ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగాలి అనుకునే వారికి ఇది మంచిగా పని చేస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్స్ పోషకాలు చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయి.

యాపిల్ : ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కంటికి చర్మానికి చాలా మేలు చేస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల చర్మం అందంగా మారడంతో పాటు ఎలాంటి రోగాలు దరిచేరవు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.