బలపాలు తినడం అంటే ఇష్టమా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే కష్టమే..!!

చిన్నప్పుడు స్కూల్లో పలకలమీద రాసే బలపాలు అంటే ఇప్పటికీ చాలా మందికి ఇష్టం. వాటిని తినేవాళ్లూ ఉన్నారు. చిన్నప్పుడు అంటే తెలియక వాటి రుచి మనకు నచ్చి తినేవాళ్లం, దానివల్ల అమ్మ కూడా నాలుగు తన్నేది. కానీ ఇంత పెద్దయ్యాక కూడా బలపాలు తినే

బలపాలు తినడం అంటే ఇష్టమా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే కష్టమే..!!


చిన్నప్పుడు స్కూల్లో పలకలమీద రాసే బలపాలు అంటే ఇప్పటికీ చాలా మందికి ఇష్టం. వాటిని తినేవాళ్లూ ఉన్నారు. చిన్నప్పుడు అంటే తెలియక వాటి రుచి మనకు నచ్చి తినేవాళ్లం, దానివల్ల అమ్మ కూడా నాలుగు తన్నేది. కానీ ఇంత పెద్దయ్యాక కూడా బలపాలు తినే అలవాటు మీరు మానుకోలేపోయారా..? సెలబ్రెటీలు కూడా చాలా మంది బలపాలు తింటారు. అది వారి చిలిపి అలవాటు. వాటి వాసన ముందు చికెన్‌, మటన్‌ స్మెల్‌ కూడా దిగదుడుపే అంత ఇష్టం ఉంటుంది బలపాలంటే కొంతమందికి. అయితే బలపాలు తినడం వల్ల మీ కోరిక తీరుతుందేమో కానీ.. దానివల్ల ఎంత ప్రమాదమే మీరెప్పుడైనా ఆలోచించారా..? బలపాలు తినడం వలన కలిగే నష్టాల గురించి ఈరోజు తెలుసుకుందాం..!
బ‌ల‌పాలు పెద్ద విష పదార్ధం కాదు. అయిన‌ప్ప‌టికీ, వీటిని తిన‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. బ‌ల‌పాల‌ను శుద్ధ‌మైన శున్నంతో చేయ‌రు. అందు వ‌ల్ల బ‌ల‌పాలు తింటే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. రోజు బ‌ల‌పాలు తిన‌డం వ‌ల్ల‌ దంతాలు డ్యామేజ్ అవ్వ‌డం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు. దంతాలు పుచ్చిపోవ‌డం, దంతాలు బ‌ల‌హీన ప‌డ‌టం ఇలా బ‌ల‌పాల వ‌ల్ల అనేక దంత సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయట.
అలాగే బ‌ల‌పాల త‌యారీలో కొన్ని ర‌కాల కెమిక‌ల్స్ కూడా వాడ‌తారు. అందువ‌ల్ల త‌ర‌చూ బ‌ల‌పాలు తీసుకుంటే జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ముఖ్యంగా కుడుపు నొప్పి, అజీర్తి, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా దెబ్బ తింటుందని నిపుణులు అంటున్నారు..
బ‌ల‌పాలు త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఆక‌లి మంద‌గించేస్తుంది. దాంతో ఏదీ తినాలనిపించదు. ఫ‌లితంగా శ‌రీరానికి త‌గిన పోష‌కాలు అంద‌క‌ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. బ‌ల‌పాలు తినే వారిలో నులి పురుగుల స‌మ‌స్య కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది.

గ‌ర్భిణులు బ‌ల‌పాలు తింటే.

ప్రెగ్నెంట్స్ గానీ, ఫీడింగ్ మదర్స్ కానీ వీటిని తింటే దాని వల్ల వచ్చే నష్టాలు వేరేలా ఉంటాయి. వారికి సరిగా ఆకలి కాక, అన్ని రకాలా ఆహార పదార్ధాలూ తీసుకోక, పోషకాహార లేమి వస్తుంది. రక్తహీనతకు గురవుతారు. ఇది వారికి మాత్రమే కాదు.. పుట్టిన, పుట్టబోయే పిల్లలకి కూడా మంచిది కాదట. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. 
పిల్లలకి ఈ తిండి మహా సరదాగా ఉంటుంది. అందరూ తినకపోవచ్చు కానీ, పిల్లల్లో చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కాబట్టి పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు పిల్లలు ఈ అలవాటుకి బానిస కాకుండా చూసుకోవాలి. వారికి భయం పెట్టాలి. చిన్నప్పుడు ఈ అలావాటును మానిపించకపోతే వాళ్లు పెరిగి పెద్దయిన తర్వాత కూడా తింటారు. బలపాలు, బియ్యం, మట్టి ఇలాంటివి పిల్లలు బాగా తింటారు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు కనిపెడుతుండాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.