హార్ట్‌ ఎటాక్స్ ఎందుకు బాత్రూమ్‌లోనే ఎక్కువగా వస్తున్నాయి..? 

మొన్న పక్కింటి అంకుల్‌.. సడన్‌గా బాత్రూమ్‌లో కుప్పకూలిపోయాడట.. హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయారు. అవును..మా బంధువుల్లో కూడా ఒక ఆమెకి అలానే బాత్రూమ్‌లోనే హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లాం కాబట్టి సరిపోయింది.. ఇలా చాలామంది చెప్పుకుంటారు. మీరు డిస్కస్‌ చేసుకునే ఉంటారు కదా.।! ఎందుకు గుండెపోట బాత్రూమ్‌లోనే ఎక్కువగా వస్తుంది.?

హార్ట్‌ ఎటాక్స్ ఎందుకు బాత్రూమ్‌లోనే ఎక్కువగా వస్తున్నాయి..? 


మొన్న పక్కింటి అంకుల్‌.. సడన్‌గా బాత్రూమ్‌లో కుప్పకూలిపోయాడట.. హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయారు. అవును..మా బంధువుల్లో కూడా ఒక ఆమెకి అలానే బాత్రూమ్‌లోనే హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లాం కాబట్టి సరిపోయింది.. ఇలా చాలామంది చెప్పుకుంటారు. మీరు డిస్కస్‌ చేసుకునే ఉంటారు కదా.।! ఎందుకు గుండెపోట బాత్రూమ్‌లోనే ఎక్కువగా వస్తుంది.? హార్ట్‌కు బాత్రుమ్‌కు ఎంటి లింక్‌..? అసలు బాత్రూమ్‌లో ఏం జరుగుతుంది..? ఏ కారణం వల్ల ఇలా గుండెపోటు వస్తుంది..? దీనిపై నిపుణులు ఇచ్చే సమాదానాలు ఇవే.।!
బాత్‌రూమ్‌లో మ‌ల విస‌ర్జ‌న చేసిన‌ప్పుడు లేదా మూత్ర విస‌ర్జ‌న చేసిన‌ప్పుడు శ‌రీరంపై ఒత్తిడి బాగా ఉంటే అప్పుడు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వ‌స్తాయి. ఇది హార్ట్ ఎటాక్‌కు కార‌ణ‌మ‌వుతుందని వైద్యులు అంటున్నారు. కొంద‌రు మ‌లం లేదా మూత్ర విస‌ర్జ‌న చేసేట‌ప్పుడు శ‌రీరంపై ఒత్తిడిని క‌ల‌గ‌జేస్తారు. అంటే ముక్కిన‌ట్లు చేస్తారు. దీని వ‌ల్ల వేగ‌స్ నాడిపై ఒత్తిడి ప‌డుతుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని త‌గ్గిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. 

ఇక కొంద‌రు మ‌రీ చ‌ల్ల‌గా లేదా మ‌రీ వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తారు.. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లో ఒక్క‌సారిగా మార్పులు వ‌స్తాయి. ఇది కూడా హార్ట్ ఎటాక్‌కు కార‌ణ‌మ‌వుతుంది. ఈ ప‌రిస్థితి రాకుండా ఉండేందుకు గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయాలి. 
కొంద‌రు బెడ్ మీద నుంచి లేచి వెంట‌నే హ‌డావిడిగా బాత్‌రూమ్‌కు ప‌రుగెత్తుతారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి ఒక్క‌సారిగా పెరిగి అది హార్ట్ ఎటాక్‌ను క‌ల‌గ‌జేసేందుకు కారణం అవుతుంది. బెడ్ మీద నుంచి లేచాక వెంట‌నే కింద‌కు దిగ‌కూడ‌దు. నెమ్మ‌దిగా ప‌నులు చేసుకోవాలి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించ‌వ‌చ్చు. నిద్ర లేవగానే బెడ్‌ పైనే ఒక కాలుని ఇంకో కాలుతో మసాజ్‌ చేసుకోవాలి. ఇలా రాపిడి చేయడం వల్ల హీట్‌ జనరేట్‌ అవుతుంది. రాత్రంతా నిద్రపోయినప్పుడు బాడీ రిలాక్స్‌డ్‌ మోడ్‌లోకి వెళ్తుంది. మీరు ఇలా కాళ్లకు, అరచేతులను ఒకదానికి ఒకటి రుద్దుకుని ఆ వేడిని కళ్లకు పెడితే నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది.. కళ్లు నిద్రలేవగానే చాలా అలిసిపోయినట్లు, తెరవలేం.. చేతులతో కూడా రాపిడి చేసి వేడి అంటించడం వల్ల కళ్లకు మంచి రిలాక్స్‌ అవుతుంది. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.