మహిళలకు గుండెనొప్పి రావడానికి ఇవే కారణాలు..

గుండె సమస్యలు నేడు అందరిని గుబులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు వీటి భారిన పడి హఠాత్తుగా చనిపోతున్నారు. మారుతున్న కాలంతో మహిళల లైప్‌స్టైల్ కూడా చేంజ్ అయింది. ఉద్యోగం చేయాలని అందరూ అనుకుంటున్నారు.

మహిళలకు గుండెనొప్పి రావడానికి ఇవే కారణాలు..


గుండె సమస్యలు నేడు అందరిని గుబులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు వీటి భారిన పడి హఠాత్తుగా చనిపోతున్నారు. మారుతున్న కాలంతో మహిళల లైప్‌స్టైల్ కూడా చేంజ్ అయింది. ఉద్యోగం చేయాలని అందరూ అనుకుంటున్నారు. పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత కచ్చితంగా ఉద్యోగం చేస్తున్నారు. ఇంటి పని, ఆఫీస్ పని పెరిగి మహిళలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇవన్నీ గుండె సమస్యలకు దారి తీస్తున్నాయి.
Chest Pains in Women Could Be Undiagnosed Heart Attacks | Cedars-Sinai
ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి అయి రక్తనాళాలు గట్టి పడి కుచించుకుపోయి రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీంతో గుండె నొప్పి రావడం జరుగుతుంది. 
అధికంగా బరువు పెరగడం కూడా గుండె సమస్యలు రావడానికి కారణం. స్థూలకాయుల్లో కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాలు మూసుకుపోతాయి. దీంతో గుండెకి రక్తసరఫరా నిలిచి గుండెసమస్యలు వస్తాయి
మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ నిల్వలు తగ్గిపోతాయి. దీంతో రక్తప్రసరణలో అధికంగా మార్పులు వస్తాయి. గుండె సమస్యలు వస్తాయి. విటమిన్ డి, విటమిన్ కె-2 లోపాలు కూడా గుండెనొప్పులు రావడానికి కారణం. కాబట్టి ఈ లోపాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. 
హైపోథైరాయిడిజం వల్ల గుండె స్పందనలు తగ్గిపోవడమే కాకుండా జీవక్రియలన్నీ కుంటుపడతాయి. దీంతో గుండెపనితనం కూడా తగ్గిపోతుంది. కాబట్టి మహిళలూ ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే తగిన చికిత్స తీసుకుని గుండెజబ్బులకు రాకుండా జాగ్రత్త పడాలి. 
మహిళలు అధిక బరువు ఉంటే అస్సలు లైట్‌ తీసుకోకండి. పెళ్లైంది కదా.. ఇప్పుడు ఎలా ఉంటి ఏంటిలే అన చాలా మంది అనుకుంటారు. ఇది చాలా తప్పు. మీ ఆరోగ్యానికి పెళ్లికి ముడిపెట్టకండి. ఎప్పుడు సాధారణ బరువు ఉండేలా చూసుకుంటే.. చాలా రోగాలు రాకుండా ఉంటాయి. మూములుగానే మహిళలకు ఉండాల్సినదాని కంటే ఎక్కువ టెన్షన్‌ ఉంటుంది, పని కూడా వీరికే ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కాస్త కష్టమైన పనే.. అయినా సరే మిమ్మిల్నీ మీరే చూసుకోవాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.