గుండె దడగా ఉంటుందా? ఎందుకో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

ఇప్పుడు మనం కూడా పనిచేశాక అలసిపోతాం. విశ్రాంతి తీసుకోకుండా అలానే చేస్తూ ఉంటే మనపై ఒత్తిడి పెరిగి నీరసించిపోతాం. అదే విధంగా గుండె కండరం బలంగా ఉండాలంటే రెస్ట్‌ అనేది కావాలి. అయితే గుండె దడ పెరిగింది అంటే....

గుండె దడగా ఉంటుందా? ఎందుకో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.


ఒక్కోసారి చాలా మందికి గుండె దడగా ఉంటుంది. గుండెదడ ఎలా ఉంటుందంటే... నిమిషానికి 72 సార్లు కొట్టుకోవల్సిన గుండె....కొన్నిసార్లు 100, 110 సార్లు కొట్టుకుంటుంది. గుండెవేగం పెరిగితే ఛాతీపైన అదురుతున్నట్లు ఉంటుంది. గుండె ఎక్కువసార్లు కొట్టుకోవడం వల్ల....హృదయానికి విశ్రాంతి అనేది ఉండదు.

సాధారణంగా 60 సెకన్లలో 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. అంటే ఆలోచించండి సెకను కన్నా తక్కువ సమయంలో గుండెకొట్టుకుంటుంది. అంటే దాదాపుగా 83 మిల్లీ సెకన్లకు ఒకసారి కొట్టుకుంటుంది. ఇలా చూస్తే ఈ సమయంలో కొట్టుకున్నా ప్రతిసారి మధ్యలో 40 మిల్లీ సెకన్ల సమయం ఖాళీ ఉంటుంది. లబ్‌డబ్‌ అనే శబ్దం వచ్చాక మధ్యంలో 40 మిల్లీ సెకన్ల సమయం ఖాళీ ఉంటుంది...ఆ సమయంలో గుండె విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు గుండె హాయిగా తన పని తను చేసుకుంటుంది.

ఇప్పుడు మనం కూడా పనిచేశాక అలసిపోతాం. విశ్రాంతి తీసుకోకుండా అలానే చేస్తూ ఉంటే మనపై ఒత్తిడి పెరిగి నీరసించిపోతాం. అదే విధంగా గుండె కండరం బలంగా ఉండాలంటే రెస్ట్‌ అనేది కావాలి. అయితే గుండె దడ పెరిగింది అంటే....వేగం కూడా పెరుగుతుంది. ఇక విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా నిమిషానికి ఇంచుమించు 120 సార్లు కొట్టుకుంటుంది.

ఇప్పుడు మీరు గుర్తించుకోవల్సింది ఏంటంటే...గుండె దడగా ఉందంటే దానర్థం గుండెకు విశ్రాంతి లేదని. ఇది గుండె జీవితానికి మంచిది కాదు. గుండె దడ రాకుండా ఉండాలంటే ఒత్తిడి, ఆలోచనలకు దూరంగా ఉండాలి. విపరీతమైన టెన్షన్‌ పెట్టుకోకూడదు. అనవసరమైన ఆలోచనలు మెదడులో ఉంచుకోకూడదు. దీంతో పాటు భయం, కంగారు కూడా మంచిది కాదు. కాబట్టి వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

ఎక్కడైనా ఉన్నప్పుడు గుండెదడ తగ్గాలంటే శ్వాసపై దృష్టి పెట్టాలి.  ఆలోచనల వేగం తగ్గాలంటే మనసుపై దృష్టి కేంద్రీకరించాలి. ఆలోచనలు తగ్గితే గుండెవేగం తగ్గుతుంది. ఇలా 5, 10 సార్లు చేస్తే గుండె వేగం అనేది తగ్గుతుంది. ఆలోచనల వల్ల కార్టిజోల్‌, ఎడ్రినలిన్‌ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. కార్టిజోల్‌, ఎడ్రినలిన్‌ హార్మోన్లు శరీరానికి ఎంతో నష్టం చేస్తాయి.

అయితే గుండె వేగం మామూలు స్థాయికి రావాలంటే బ్రామరీ ప్రాణాయామం చేయాలి. 15, 20 సార్లు చేస్తే గుండె వేగం 72కు వచ్చేస్తుంది. 2 చెవుల్లో చూపుడు వేళ్లను పెట్టుకుని కళ్లు మూసుకుని ఓం అని అనాలి. దాన్నే బ్రామరీ ప్రాణాయామం అంటారు. దానివల్ల త్వరగా గుండెదడ తగ్గుతుంది.  అయితే గుండెజబ్బులు దూరంగా ఉండాలంటే మాత్రం శాశ్వత పరిష్కారానికి చూసుకోవాలి. ఇప్పుడున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఉన్నప్పుడు మాత్రం చాలా ఒత్తిడి, టెన్షన్‌ ఉంటుంది. అలాంటి వారు కచ్చితంగా యోగా, ధ్యానం చేయాల్సిందే. ఇదొక్కటే శాశ్వత పరిష్కారం. ప్రతిరోజు ఒక అరగంట యోగా, ధ్యానం చేస్తే చాలా మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.