మోకాళ్ల నొప్పులను ఖర్చు లేకుండా ఇలా సులభంగా తగ్గించుకోవచ్చు..! 

ఒక వయసు వచ్చాక.. అందరికీ మోకాళ్లు, కీళ్లు నొప్పులు వేధిస్తుంటాయి. వీటి బాధ పైకి కనిపించదు కానీ.. ఆ మనిషి మాత్రం నరకం అనుభవిస్తారు. అడుగు తీసి అడుగు వేయలేరు. మోకాళ్ల నొప్పులకు చాలా మంది ఎన్నో రకాల మందులు, చికిత్సలు తీసుకుని ఉంటారు. వీటి వల్ల సొల్యూషన్‌ ఉంటుంది కానీ శాశ్వతంగా కాదు. మీరు ఆ మందులు వాడినంత కాలం మత్రమే. ఆయుర్వేద చిట్కాలను ప్రతి

మోకాళ్ల నొప్పులను ఖర్చు లేకుండా ఇలా సులభంగా తగ్గించుకోవచ్చు..! 


ఒక వయసు వచ్చాక.. అందరికీ మోకాళ్లు, కీళ్లు నొప్పులు వేధిస్తుంటాయి. వీటి బాధ పైకి కనిపించదు కానీ.. ఆ మనిషి మాత్రం నరకం అనుభవిస్తారు. అడుగు తీసి అడుగు వేయలేరు. మోకాళ్ల నొప్పులకు చాలా మంది ఎన్నో రకాల మందులు, చికిత్సలు తీసుకుని ఉంటారు. వీటి వల్ల సొల్యూషన్‌ ఉంటుంది కానీ శాశ్వతంగా కాదు. మీరు ఆ మందులు వాడినంత కాలం మత్రమే. ఆయుర్వేద చిట్కాలను ప్రతి రోజు పాటించడం వల్ల ఈ మోకాళ్ల నొప్పులను నయం చేసుకోచ్చు. పైగా వీటి వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావు. 
ఆయుర్వేద నిపుణులు కలబందను ఔషధంగా భావిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాల రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి తీవ్ర కీళ్ల, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు నొప్పి ప్రభావిత ప్రాంతంలో అలోవెరా జెల్‌ను అప్లై చేసి మసాజ్‌ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మోకాళ్ల వాపులు కూడా తగ్గుతాయని ఆయర్వేద నిపుణులు చెప్తున్నారు.
Knee Pain and Problems | Johns Hopkins Medicine
తీవ్ర మోకాళ్ల నొప్పుల కారణంగా బాధపడేవారు కర్పూరం నూనెను కూడా వినియోగించవచ్చు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. ముందుగా కర్పూరం నూనె తీసుకుని బౌల్‌లో పోసుకుని గోరువెచ్చగా చేయండి. ఆ తర్వాత ఈ నూనెను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 15 నిమిషాల పాటు బాగా మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా తీవ్ర మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు పసుపు వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిని వినియోగించే ముందు ఒక బౌల్‌ తీసుకుని అందులో ఆవాల నూనెను వేసి.. ఒక టీస్పూన్ పసుపును వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.