కలోంజి.. ఈ నల్లటి గింజలను పొడి చేసి రోజు తీసుకుంటే  డయాబెటిక్ తగ్గిపోతుంది.. ఇంకా ఎన్ని ప్రయోజనాలో..!

మంచి సువాసనను వెదజల్లే కలోంజి సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాము ఇవి వంటకు మంచి రుచినే ఇవ్వడంతో పాటు శరీరానికి సైతం ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్లు ఫైబర్ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

కలోంజి.. ఈ నల్లటి గింజలను పొడి చేసి రోజు తీసుకుంటే  డయాబెటిక్ తగ్గిపోతుంది.. ఇంకా ఎన్ని ప్రయోజనాలో..!
Benefits of kalonji seeds


మంచి సువాసనను వెదజల్లే కలోంజి సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాము ఇవి వంటకు మంచి రుచినే ఇవ్వడంతో పాటు శరీరానికి సైతం ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్లు ఫైబర్ ఆరోగ్యాన్ని కాపాడతాయి ఎన్నో రకాల సమస్యలను దూరం చేస్తాయి.

చూడటానికి చిన్నగా నల్లటి గింజలు లా కనిపించే ఈ కలోజి గింజలను పొడిచేసి తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది అందులో ముఖ్యంగా..

చర్మ సమస్యలు దూరం అవుతాయి..

చర్మానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని తగ్గించడంలో కలోంజీ సీడ్స్‌ సహాయపడతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఫ్యారాసైడ్‌ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను నివారించడానికి తోడ్పడతాయి. 

డయాబెటిస్ దూరం..

మధుమేహం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు మందులు ఉపయోగించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఆహారం విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు పాటించాలి అయితే ఈ గింజలను పొడిచేసి నీటితో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని తెలుస్తోంది.

సోరియాసిస్ ను తగ్గిస్తుంది.. 

కలోంజీ సీడ్స్‌ సోరియాసిస్‌ వంటి తీవ్రమైన చర్మ సమస్యలను సైతం దూరం చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. కలోంజీ విత్తనాలు డైట్‌లో చేర్చుకుంటే చర్మ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎవిడెన్స్-బేస్డ్ కాంప్లిమెంటరీ & ఆల్టర్నేటివ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది.

బరువు అదుపులో ఉంటుంది..

కలోంజీ విత్తనాలు డైట్‌లో చేర్చుకుంటే.. బరువు కంట్రోల్‌లో ఉంటుందని తెలుస్తోంది. అలాగే కలోంజీ విత్తనాలు కొవ్వును తగ్గించడానికి సహాయ పడతాయి. 

థైరాయిడ్ అదుపులో.. 
 
థైరాయిడ్.. గ్రంధి పనితీరులో ఏమాత్రం తేడా వచ్చిన శరీరం మొత్తం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎండోక్రైన్ గ్రంధి, ఇది జీవక్రియను నిర్వహించడానికి సహాయపడే హార్మోన్లను తయారు చేస్తుంది, విడుదల చేస్తుంది. ఇది సరిగ్గా పని చేయకపోతే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజంకు దారితీస్తుంది. మీ డైట్‌లో కలోంజి విత్తనాలు చేర్చుకుంటే.. థైరాయిడ్‌ పనితీరును మెరుగపరచుకోవచ్చు. 

గ్యాస్టిక్ సమస్యలను దూరం..

ఎవరికైతే గ్యాస్ అవసరమైన సమస్యలు ఉంటాయో అలాంటివారు కలోంజి గింజలను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరమవుతాయి.

కొలెస్ట్రాల్‌ కరిగిస్తుంది..

అధిక కొలెస్ట్రాల్‌.. గుండెపోటు, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన అనారోగ్యాల ముప్పును పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి ఆరోగ్యకరమైన ఆహారం కీలకం. డైట్‌లో కలోంజీ విత్తనాలు చేర్చుకుంటే.. చెడు కొలెస్ట్రాల్‌ కరుగుతుంది, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.