డైట్ మొదలు పెట్టాలనుకుంటున్నారా.. చర్మం కాంతిని కోల్పోకుండా ఈ ఫుడ్ తో మెయింటైన్ చేస్తే సరి.!

చాలామంది డైట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఫాలో అవ్వకపోతే చర్మంతో పాటు ముఖం సైతం కలతపుతుంది నిర్జీవంగా మారిపోతుంది.

డైట్ మొదలు పెట్టాలనుకుంటున్నారా.. చర్మం కాంతిని కోల్పోకుండా ఈ ఫుడ్ తో మెయింటైన్ చేస్తే సరి.!
Diet plan for glowing skin


చాలామంది డైట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఫాలో అవ్వకపోతే చర్మంతో పాటు ముఖం సైతం కలతపుతుంది నిర్జీవంగా మారిపోతుంది. అందుకే డైట్ చేస్తున్న సమయంలో సైతం చర్మం మెరిసిపోవాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తప్పనిసరిగా డైట్ లో తీసుకోవాలి

చర్మాని అందంగా మార్చాలంటే కొన్ని ఆహార పదార్థాలు ముందుంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల నిత్యం యవ్వనంగా మెరిసిపోవచ్చు. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు సైతం అందుతాయి. అందులో ముఖ్యంగా..

ఫ్యాటీ ఫిష్‌..

చర్మం ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సాల్మన్‌, మాకేరేల్‌, హెర్రింగ్‌ వంటి కొవ్వు చేపలు ఆహారంలో చేర్చుకోవాలి. ఫ్యాటీ ఫిష్‌లో చర్మ ఆరోగ్యాన్ని రక్షించే.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఆరోగ్యకరమైన, మృదువైన చర్మాన్ని నిర్వహించడానికి అవసరం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ లోపం కారణంగా చర్మం పొడిబారుతుంది, మంట, చర్మం ఎర్రగా మారడం, మొటిమలు వంటి సమస్యలు ఎదురవుతాయి.

చిలగడదుంపలు..

చిలగడదుంపలలో.. బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ చర్మంలోని అధిక నూనెను బయటకు పంపి.. తాజాగా, టాక్సిన్స్‌ లేకుండా ఉంచుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి బెస్ట్‌ ఆప్షన్‌. బీటా కెరోటిన్ UVA కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది, సన్ టాన్‌ను కూడా తొలగిస్తుంది. మొక్కల్లో విటమిన్ A బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ Aగా మారుతుంది. బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, పసుపు పచ్చని పండ్లలోనూ బీటా కెరోటిన్‌ మెండుగా ఉంటుంది.

వాల్‌నట్స్‌..

చర్మ ఆరోగ్యానికి వాల్‌నట్స్‌ ఎంతో మేలు చేస్తాయి. వాల్‌నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇతర నట్స్‌తో పోలిస్తే వాల్‌నట్స్‌లో ఒమేగా -3, ఒమేగా -6 దీనిలో అధికంగా ఉంటుంది.

అవకాడో..

అవకాడోలోని పోషకాలు చర్మాన్ని సూర్య కిరణాలు, యూవీ రేస్‌ నుంచి రక్షిస్తాయని అధ్యయనాలు స్పష్టం చేశాయి. యూవీ కిరణాల వల్ల చర్మంపై ముడతలు, ఇతర వృద్ధాప్య లక్షణాలు ఎదురవుతాయి.
అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వులు చర్మ ఆరోగ్యంతో సహా మిమ్మల్నీ ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం తేమగా, మృదువుగా ఉండటానికి హెల్తీ ఫ్యాట్స్‌ను తగినంత తీసుకోవడం చాలా ముఖ్యం.

టమాటాలు..

టమాటాలో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షించడానికి సహాయపడతాయి. టమాటాలలో లైకోపీన్‌తో ప్రధాన కెరోటినాయిడ్లు, విటమిన్ సీ వంటి ఫోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీటా కెరోటిన్, లుటిన్, లైకోపీన్ మీ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. ఈ పోషకాలు ముడతలను కూడా నివారిస్తాయి.

బ్రకోలీ..

బ్రకోలీలో విటమిన్‌ ఏ, జింక్‌, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీనిలో బీటా కెరోటిన్ మాదిరిగానే పనిచేసే లుటిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది చర్మం పొడిబారడానికి, ముడతలకు దారితీసే ఆక్సిడేటివ్ స్కిన్ డ్యామేజ్‌ను నివారించడాని లుటీన్‌ సహాయపడుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.