Anti aging fruits : ఈ ఫ్రూట్స్‌ తింటే.. నిత్యం యవ్వనంగా ఉండొచ్చు.. ఇప్పటినుంచే స్టాట్‌ చేయండి..!

Anti aging fruits : మీకు వయసు పెరిగే కొద్ది.. రావాల్సిన రోగాలు, చర్మంలో తేడాలు ఇవన్ని సహజం.. జరిగిపోతుంటాయి.. మనం ఎంత ఆపినా ఆగవు.. కానీ మనం పోస్ట్‌పోన్‌ చేయొచ్చు.. అలా చేసే. కదా.. మన హీరోలు 50 ఏళ్లు వచ్చినా ఇంకా యంగ్‌గానే ఉంటున్నారు.

Anti aging fruits : ఈ ఫ్రూట్స్‌ తింటే.. నిత్యం యవ్వనంగా ఉండొచ్చు.. ఇప్పటినుంచే స్టాట్‌ చేయండి..!
Eat this fruits to stay young forever


Best anti aging fruits : చట్టం తన పని తాను చేుసుకంటూ పోతుంది అంటారు.. చట్టం కంటే వేగంగా ప్రకృతి కూడా తన పని తాను చేసుకుంటుంది..మీకు వయసు పెరిగే కొద్ది.. రావాల్సిన రోగాలు, చర్మంలో తేడాలు ఇవన్ని సహజం.. జరిగిపోతుంటాయి.. మనం ఎంత ఆపినా ఆగవు.. కానీ మనం పోస్ట్‌పోన్‌ చేయొచ్చు.. అలా చేసే. కదా.. మన హీరోలు 50 ఏళ్లు వచ్చినా ఇంకా యంగ్‌గానే ఉంటున్నారు. మీరు నిత్యం యవ్వనంగా ఉండాలంటే.. కొన్ని ఫ్రూట్స్‌ను ఇప్పటి నుంచే తినండి.. రసాయనాలతో కూడిన బ్యూటీ ప్రొడెక్ట్స్‌ను వాడేబదులు.. పండ్లు తినడం వల్ల అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. మనం రోజూ తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకుంటే మీ చర్మానికి నిగారింపు వస్తూ నిత్య యవ్వనంగా కనపడతారు.  

నారింజ -

నారింజ పండులో విటమిన్ సీ ఉంటుంది. దీన్ని తరచూ తింటూ ఉంటుంటే ఎన్నో ఫలితాలను పొందవచ్చు. నారింజ మంచి ఆరోగ్యంతో పాటు చర్మం మెరిసేలా చేస్తుంది. నారింజను తిన్న అనంతరం మిగిలిపోయిన తొక్కలను ముఖం మీద అప్లై చేసినా, లేక వాటిని ఎండ బెట్టి ఫేస్ ప్యాక్‌లలో ఉపయోగించినా.. అది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

యాపిల్-

ప్రతి రోజు ఒక యాపిల్ తినమని మన చిన్నప్పటి నుంచి చెప్పేమాట.. యాపిల్స్‌లో ఉండే విటమిన్‌ ఏ, సీలతో పాటు యాంటీ యాక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్‌ మీ చర్మానికి రక్షణ ఇస్తుంది.

పుచ్చకాయ-

మంచి టేస్ట్‌తో పాటు దాదాపు 92 శాతం నీరు ఉండే పుచ్చ కాయలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇందులోని విటమిన్‌ సీ, ఏ, బీ1 చర్మానికి కాంతిని చేకుర్చుతాయి. వయసుతో పాటు చర్మంపై వచ్చే ముడతలకు చెక్‌ పెట్టి యవ్వనంగా కనబడేలా చేస్తుంది. రోజు ఒక గ్లాసు పుచ్చకాయ జ్యూస్‌ తాగితే చర్మానికి చాలా మంచిది.

నిమ్మకాయ-

నిమ్మకాయలను ఎలా తినాలి అనుకుంటున్నారా.. నిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా వీటి ద్వారా చర్మం డీహైడ్రేట్‌కు గురికాకుండా ఉంటుంది. నిమ్మరసాన్ని జ్యూస్ గా తాగొచ్చుగా..!

కీర దోసకాయ-

కీర దోసకాయను బ్యూటీ టిప్స్‌లో ఘోరంగా వాడతారు.. కీర దోసకాయ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్‌ సీ, కేలు చర్మం ప్రకాశవంతంగా మెరవడానికి దోహదపడతాయి. కళ్ళ కింద ఏర్పడిన నల్లటి బ్లాక్ సర్కిళ్లను తొలగించడానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. అలాగే కీరదోసకాయను డైలీ తినడం వల్ల బాడీలో వేడి తగ్గుతుంది.
ఇవి పెద్దగా ఖర్చుతో కూడుకున్నవి కాదు.. అన్నీ బడ్జెట్‌లోనే వచ్చేస్తాయి.. వీటిని మీరు డైలీ డైట్‌లో భాగం చేసుకుంటే.. నెలరోజుల్లోనే మీ చర్మం కాంతివతంగా మారిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ట్రై చేయండి.! వీటి వల్ల బరువు పెరుగుతారేమో అని భయం అక్కర్లేదు. వీటి వల్ల మీ బరువుకు ఎలాంటి సమస్యా ఉండదు.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.