షాంపూలో ఉప్పు కలిపి తలస్నానం చేస్తే ఏం అవుతుందో తెలుసా..?

ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు.. తక్కువ వాడాలి అని వైద్యులు చెప్తుంటారు.

షాంపూలో ఉప్పు కలిపి తలస్నానం చేస్తే ఏం అవుతుందో తెలుసా..?
Benefits of Salt For Hair


ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు.. తక్కువ వాడాలి అని వైద్యులు చెప్తుంటారు. అవును ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు కానీ. అందానికి మంచిదే.. వేడినీళ్లలో ఉప్పవేసుకుని కాళ్లు పెట్టుకుంటే.. పాదాలపైన ఉన్న ట్యాన్‌ అంతా పోతుంది. అలాగే షాంపూలో రెండు స్పూన్ల ఉప్పు వేసుకుని తలస్నానం చేస్తే.. జుట్టు సమస్యలన్నీ నయం అవుతాయట.. అస్సలు నమ్మబుద్ధి అవడం లేదు కదా.. సాధారణంగా వాటర్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటేనే ఆ ఉప్పు నీళ్ల వల్ల జుట్టు అంతా ఊడిపోతుంది అంటారు. అలాంటిది ఏకంగా జుట్టుకే ఉప్పు పెట్టమంటున్నారే అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం అండీ..! 

చుండ్రు వంటి ఫంగ‌ల్ ఇన్ ఫెక్ష‌న్ల వ‌ల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కొన్ని ర‌కాల చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డాన్ని తగ్గించి జుట్టును న‌ల్ల‌గా ఒత్తుగా పెంచుకోవ‌చ్చు. మ‌నం నిత్యం వాడే షాంపులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఉప్పును వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి ప‌ది నిమిషాల త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. వెంట్రుక‌ల ఎదుగుద‌ల‌కు ఉప్పు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉప్పును స్క్ర‌బ్‌గా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇది మృత క‌ణాల‌ను తొల‌గిస్తుంది. జుట్టును రెండు భాగాలుగా చేసి త‌ల‌పై ఉప్పును చ‌ల్లాలి. త‌రువాత త‌డి వేళ్ల‌తో 10 నుంచి 15 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది.

త‌ల‌లో అధికంగా ఉన్న నూనెను కూడా ఉప్పు పీల్చుకుంటుంది. మృత క‌ణాలు కూడా తొల‌గిపోతాయి. నూనెలో ఉప్పును క‌లిపి త‌ల‌కు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.. నూనెలో ఉప్పును కలిపి కొద్ది సేపు మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వల్ల మూసుకుపోయిన జుట్టు రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో జుట్టు ముందు కంటే ఎక్కువ త్వ‌ర‌గా పెరుగుతుంది. ఈ చిట్కాను వారానికి రెండు నుంచి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల జుట్టుకు త‌గిన‌న్ని పోష‌కాలు ల‌భించడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు ధృడంగా, కాంతివంతంగా ఆరోగ్యంగా త‌యార‌వుతుంది

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.