చంకలు, మెడపై నలుపు పోవాలంటే ఇలా చేయండి చాలు..!

చాలామందికి..చంకల్లో, మెడపై ఇంకా ప్రైవేట్‌ పార్ట్స్‌లో స్కిన్‌ బాగా డార్క్‌గా ఉంటుంది. దీని వల్ల కొన్ని డ్రెస్స్‌లు వేసుకున్నప్పుడు..చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు అయితే ఈ సమస్యను బాగా అనుభవిస్తారు.

చంకలు, మెడపై నలుపు పోవాలంటే ఇలా చేయండి చాలు..!


చాలామందికి..చంకల్లో, మెడపై ఇంకా ప్రైవేట్‌ పార్ట్స్‌లో స్కిన్‌ బాగా డార్క్‌గా ఉంటుంది. దీని వల్ల కొన్ని డ్రెస్స్‌లు వేసుకున్నప్పుడు..చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు అయితే ఈ సమస్యను బాగా అనుభవిస్తారు. ఈ పార్ట్‌ను తెల్లగా చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం.. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ చ‌ర్మం రంగు మార‌దు. స‌హజ సిద్దంగా ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం వంటింట్లో ఉండే ప‌దార్థాల‌ను ఉప‌యోగించే ఈ భాగాల‌లోని చ‌ర్మాన్ని మ‌నం తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. చంకలు, గ‌జ్జ‌లు వంటి భాగాల‌లో చ‌ర్మాన్ని రెండు ఇంటి చిట్కాల ద్వారా మ‌నం తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు.  

పంచ‌దార‌ను, ట‌మాటను ఉప‌యోగించి చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.. ముందుగా ఒక ట‌మాటాను తీసుకుని మ‌ధ్య‌లోకి క‌ట్ చేసుకోవాలి. ఇప్ప‌డు ఒక ప్లేట్‌లో పంచ‌దార‌ను తీసుకుని క‌ట్ చేసిన ట‌మాట స‌గ భాగానికి పంచ‌దార‌ను అద్ది చంక, గ‌జ్జల‌ భాగాల‌లో 5 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేసి అర గంట త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల న‌ల్ల‌గా ఉండే చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది. అంతే కాకుండా చ‌ర్మం పై ఉండే మృత క‌ణాలు కూడా తొల‌గిపోతాయి.

ఇక రెండో చిట్కా ఏంట్రా ఏంటంటే.. శ‌న‌గ పిండి, బియ్యం పిండి, బంగాళాదుంప‌, ట‌మాట‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ట‌మాట‌ను గుజ్జుగా చేసుకోవాలి. త‌రువాత బంగాళాదుంప నుంచి ర‌సాన్ని తీసుకోవాలి. ఒక గిన్నెలో నాలుగు టీ స్పూన్ల శ‌న‌గ పిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 4 టీ స్పూన్ల ట‌మాట గుజ్జు, 2 టీ స్పూన్ బంగాళా దుంప ర‌సాన్ని వేసి ప్టేస్‌లా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పేస్ట్‌ను చంక‌లు, ప్రైవేట్‌ పార్ట్స్‌లో 5 నిమిషాల పాటు రాసుకోవాలి. అర గంట త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల న‌ల్ల‌గా ఉండే చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది.

ఈ చిట్కాలను పాటించడం వల్ల చర్మం తెల్లగా అవుతుంది. ఏవేవో క్రీమ్స్‌ వాడటం బదులు ఇంట్లోనే తయారుచేసుకున్న ఈ మిశ్రమంతో మీరు స్కిన్‌ను హెల్తీగా ఉంచుకోవచ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.