పొడవుగా పెరుగుతుందని జుట్టు చివర్లను కట్‌ చేస్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి 

జుట్టును మెయింటేన్‌ చేయడం కూడా ఒక ఆర్ట్‌. జుట్టుకు ఎలా ఆయిల్‌ పెట్టాలి, ఎప్పుడు ఆయిల్‌ పెట్టాలి, ఎలా దువ్వుకోవాలి, తలస్నాం ఎలా చేయాలి, చేసిన వెంటనే ఏం చేయాలి, బయటకు వెళ్లినప్పుడు హెయిర్‌ను ఎలా జాగ్రత్తగా

పొడవుగా పెరుగుతుందని జుట్టు చివర్లను కట్‌ చేస్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి 


జుట్టును మెయింటేన్‌ చేయడం కూడా ఒక ఆర్ట్‌. జుట్టుకు ఎలా ఆయిల్‌ పెట్టాలి, ఎప్పుడు ఆయిల్‌ పెట్టాలి, ఎలా దువ్వుకోవాలి, తలస్నాం ఎలా చేయాలి, చేసిన వెంటనే ఏం చేయాలి, బయటకు వెళ్లినప్పుడు హెయిర్‌ను ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, జర్నీలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి.. ఇవన్నీ తెలుసుకోని ఉండాలి. ఎలా పడితే అలా జుట్టును వదిలేస్తే.. అది కూడా ఎలా పడితే అలా ఉంటుంది. మళ్లీ మీరే నా జుట్టు అంతా ఊడిపోతుంది, ఎంత తిన్నా, ఎన్ని ఆయిల్స్‌ వాడినా లాభం లేదని బాధపడతారు. చాలామంది.. అప్పుడప్పుడు జుట్టు చివర్ల కట్‌ చేస్తే.. జుట్టు పెరుగుతుంది అంటారు. ఇందులో నిజమెంత ఉంది. కట్‌ చేస్తే జుట్టు తగ్గిపోతుంది కానీ ఎలా పెరుగుతుంది..? ఈ లాజిక్‌ ఎలా మిస్‌ అవుతున్నారు..? అసలు నిజంగానే జుట్టు చివర్ల కట్‌ చేస్తే పెరుగుతుందా..?
How to Cut Your Own Hair
ట్రిమ్ చేస్తే జుట్టు పొడవుగా పెరగదు. జుట్టు రూట్ బలంగా ఉంటేనే జుట్టు పొడవుగా పెరుగుతుంది. స్ప్లిట్ హెయిర్ ఏర్పడినప్పుడు కట్ చేయాలి. ఈ సందర్భంలో పొడవు పెరుగుతుంది. అంతేకానీ బాగా ఉన్న జుట్టును కట్ చేస్తే ప్రయోజనం పెద్దగా ఉండదు. మన జుట్టు ఆరోగ్యం వారసత్వంగా వస్తుంది. తల్లిదండ్రులకు లేదా తాతలకు మందపాటి జుట్టు ఉంటే జన్యువును పొందవచ్చు. అలా మీ జట్టు బాగా ఉంటుంది.
జుట్టు ఆరోగ్యానికి సంరక్షణ చాలా ముఖ్యం. జుట్టుకు రెగ్యులర్ ఆయిల్ మసాజ్ అవసరం. వారానికి రెండు సార్లు మసాజ్ చేయడం చాలా మంచిది. జుట్టును రోజుకు రెండుసార్లు దువ్వాలి, ఇలా చేయడం వల్ల జుట్టు మూలాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బాహ్య పోషణ మాత్రమే కాదు అంతర్గత పోషణ కూడా జుట్టుకు చాలా ముఖ్యం. కెరాటిన్‌లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బీన్స్, బ్రోకలీ, సోయాబీన్స్, సాల్మన్. చేప నూనె, నట్స్, చికెన్, గుడ్లు చాలా మంచిది. జుట్టు రాలడాన్ని ఎక్కువగా ఎదుర్కొంటుంటే స్పెషలిస్ట్‌ని కలవండి. సరైన సమయంలో చికిత్స పొందండి. మీకు సప్లిమెంట్లు, షాంపూ, కండీషనర్‌ను సూచించవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
అనేక కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది. కొందరికి మానసిక ఒత్తిడి వల్ల రాలుతుంది. వాయు కాలుష్యం, పౌష్టికాహారం లేకపోవడం, హార్మోన్లలో మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యలు, జుట్టు సంరక్షణ పట్ల శ్రద్ధ లేకపోవడం మొదలైనవి జుట్టు రాలడానికి కారణమవుతాయి. జుట్టు రాలడం లేదా జుట్టు చిట్లడం ఒకేలా ఉండదు. జుట్టు చిట్లడం వల్ల జుట్టు రాలదు. అయితే దీంతో జుట్టు మాత్రం పొడవుగా పెరగదు. అదే జుట్టు రాలడం అంటే జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం వల్ల రూట్ నుంచి జుట్టు రాలుతుందన్నమాట. సమస్యను బట్టి చికిత్స ఉండాలి. అన్నింటికి ఒకేలా చేస్తే ప్రయోజనం ఉండదు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.