Beauty Tips For Face : ముఖంపై మొటిమలా..? ఇలా చేయండి శాశ్వతంగా పోతాయి..!

Beauty Tips For Face, Tips For acne, Tips For acne on face, Natural ways to remove acne on face , Pimples, Tips for pimples,

Beauty Tips For Face : ముఖంపై మొటిమలా..? ఇలా చేయండి శాశ్వతంగా పోతాయి..!


Beauty Tips For Face : మొటిమలు మనల్ని ఎంత ఇబ్బందిపెడతాయో బాగా తెలుసు..అసలేంటో..ఎక్కడా ప్లేస్‌ లేనట్లు.. చెంపలమీదే వస్తాయి. మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి మార్కెట్‌లో దొరికే ఆయింట్ మొంట్‌లను, క్రీములను వాడుతాం.. ముఖంపై వ‌చ్చే మొటిమ‌ల‌ను మ‌నం స‌హ‌జ సిద్దంగా కూడా త‌గ్గించుకోవ‌చ్చు. కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మొటిమ‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

మొటిమల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు రోజుకు క‌నీసం 4 లీట‌ర్ల నీళ్లు తాగాలి. రెండు సార్లు మ‌ల విస‌ర్జ‌న‌కు వెళ్లాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శరీరంలోని మ‌లినాలు, వ్య‌ర్థ ప‌దార్థాలు, హానిక‌ర ప‌దార్థాలు, మ‌నం తీసుకునే జంక్ ఫుడ్ లో ఉండే ర‌సాయనాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. 

నీళ్లు తాగ‌డం వల్ల చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వడంతో పాటు మొటిమ‌ల‌కు కార‌ణ‌మ‌య్యే వ్య‌ర్థాలు కూడా తొలిగిపోతాయి. అలాగే ముఖానికి కొబ్బ‌రి నూనెను కానీ పాల మీద మీగ‌డ‌ను కానీ రాయాలి. ఇలా రాసిన త‌రువాత ఫేషియ‌ల్ స్టీమ‌ర్ తో ముఖానికి ఆవిరి ప‌ట్టుకోవాలి.

ఇలా చేయ‌డం వల్ల మొటిమ‌ల‌కు కార‌ణ‌మ‌య్యే వ్య‌ర్థ ప‌దార్థాలు చ‌ర్మ రంధ్రాల నుండి చెమ‌ల రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఇలా ప్ర‌తిరోజూ ముఖానికి నూనె కానీ మీగ‌డ కానీ రాసుకుని ఆవిరి ప‌ట్టుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది. 

మొటిమ‌ల వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌డ్ ఫేస్ ఫ్యాక్ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. పొలాల్లో ఉండే న‌ల్ల‌టి మ‌ట్టిని ఈ ఫేస్ ఫ్యాక్‌కు ఉప‌యోగించాలి. పై భాగంలో ఉండే మ‌ట్టిని తీసేసి అర అడుగు లోప‌లిరి త‌వ్వి మ‌ట్టిని సేక‌రించాలి. ఈ మ‌ట్టిని ఉండ‌లు లేకుండా న‌ల‌గొట్టి జ‌ల్లించాలి. ఇలా జ‌ల్లించ‌గా వ‌చ్చిన మెత్త‌టి మ‌ట్టికి నీటిని క‌లిపి 4 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. ఇలా త‌యారు చేసుకున్న మ‌ట్టికి కొద్దిగా ప‌సుపును క‌లిపి ముఖానికి ఫ్యాక్‌లా వేసుకోవాలి. ఈ మ‌ట్టి ఆరిన త‌రువాత నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా వేసుకోవ‌డం వ‌ల్ల ముఖ చ‌ర్మానికి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రిగి ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గుతాయి.

మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు రోజూ ఉద‌యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌కు తేనె, నిమ్మ‌ర‌సం క‌లుపుకొని తాగాలి. 

అదే విధంగా సాయంత్రం ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ లేదా బ‌త్తాయి జ్యూస్‌ను తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మొటిమ‌లు వాటి వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. 

మొటిమ‌లను గిళ్ల కూడ‌దు. పిండ‌కూడ‌దు. అలాగే ముఖం శుభ్రం చేసుకునేట‌ప్పుడు వాటిపై గ‌ట్టిగా రుద్ద‌కూడ‌దు. కాట‌న్ వ‌స్త్రంతో లేదా దూదితో నెమ్మ‌దిగా శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో కూడా రాకుండా ఉంటాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.